జొన్నలను అమ్ముకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మార్కెట్కు భారీగా జొన్న పంట వస్తుండడంతో అధికారులు టోకెన్ సిస్టమ్ అమలుచేస్తున్నారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని ఐకేపీ కార్యాలయంలో శనివారం నుంచి టోకెన్లు జారీ చేస్తామని అధికారులు ప్రకటించడంతో రైతులు ముందు రోజు రాత్రే భారీగా చేరుకున్నారు. శనివారం ఉదయం భారీ క్యూలైన్లో ఉండి టోకెన్ల కోసం ఎగబడ్డారు. తోపులాటలు జరగడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి ప్రశాంతంగా టోకెన్ల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నారు.
