కరెంటు కోతలను నిరసిస్తూ రైతుల రాస్తారోకో

కరెంటు కోతలను నిరసిస్తూ రైతుల రాస్తారోకో

వ్యవసాయ కరెంటు కోతలను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా కోహెడ సబ్ స్టేషన్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. తీగలకుంటపల్లికి చెందిన రైతుల రాస్తారోకో చేపట్టారు. కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయని, 24 గంటల కరెంటు ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 24 గంటల కరెంటు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని రైతులు మండిపడ్డారు. ఆరుగాలం కష్టపడి వేసుకున్న వరి పంట కరెంటు లేక ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా 24 గంటల కరెంటు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.