రైతుకు పరిహారం : ఆర్డీవో ఆఫీస్ లో కంప్యూటర్లు స్వాధీనం

రైతుకు పరిహారం : ఆర్డీవో ఆఫీస్ లో కంప్యూటర్లు స్వాధీనం

 వరంగల్ అర్బన్ జిల్లా : 29 ఏళ్ల పాటు కొనసాగిన ఓ భూపరిహారం కేసులో కీలక తీర్పు ఇచ్చింది వరంగల్ జిల్లా కోర్టు. చెక్ డ్యామ్ నిర్మాణంలో భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించడంలో ఆలస్యం చేసినందుకు… ఆర్డీవో ఆఫీసులోని సామాగ్రిని స్వాధీనం చేసుకోవాలని సూచించింది. న్యాయస్థానం ఆదేశాలతో లాయర్లతో కలిసి.. హన్మకొండ ఆర్డీవో కార్యాలయానికి వచ్చిన రైతులు.. ఆఫీసులోని వాహనాలు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నాడు.

ఉమ్మడి వరంగల్ జిల్లా జఫర్ గడ్ మండలం రఘునాథపల్లికి చెందిన వెంకట్ రెడ్డి బ్రదర్స్.. చెక్ డ్యామ్ నిర్మాణంలో 5 ఎకరాల 5గుంటల భూమి కోల్పోయారు. దానికి లక్షా ఇరవై వేల సాయం మాత్రమే ఇవ్వడంతో.. నిబంధనల ప్రకారం మరింత పరిహారం రావాల్సి ఉందని కోర్టును ఆశ్రయించారు. 1990 నుంచి పోరాటం చేస్తున్నారు. చివరకు ఇవాళ జిల్లా కోర్టు తీర్పు చెప్పింది. దాంతో హన్మకొండ ఆర్డీవో ఆఫీసుకు వెళ్లి.. వాహనాలు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నాడు రైతు వెంకట్ రెడ్డి.