V6 News

తల్లాడ మండలంలో ధాన్యం కొనాలని రాస్తారోకో  

తల్లాడ మండలంలో ధాన్యం కొనాలని రాస్తారోకో  

తల్లాడ, వెలుగు: తల్లాడ మండలంలో కొనుగోలు కేంద్రాల ద్వారా వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు గురువారం రాస్తారోకో నిర్వహించారు. తల్లాడ బస్టాండ్ ఎదుట హైదరాబాద్–దేవరపల్లి జాతీయ రహదారిపై రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు ఈ ఆందోళనకు మద్దతు తెలిపారు.

  కల్లాల్లో వడ్లు ఆరబోసి 20 రోజులు దాటినా కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సమాచారం అందుకున్న తల్లాడ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రైతులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అనంతరం తహసీల్దార్ కరుణాకర్ రెడ్డి ధర్నా స్థలానికి చేరుకుని ఉన్నతాధికారులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆపతి వెంకట రామారావు, చల్లా నాగులు, చల్లా నరేష్, రాయల రమేష్, కిరణ్ తదితరులు, రైతులు పాల్గొన్నారు.