ఢిల్లీ వైపు రైతుల పాదయాత్ర.. సరిహద్దుల్లో భారీభద్రత

ఢిల్లీ వైపు రైతుల పాదయాత్ర.. సరిహద్దుల్లో భారీభద్రత

న్యూఢిల్లీ: తమ ఢిల్లీ ఛలో మార్చ్ ను కొనసాగిస్తామని రైతులు ప్రకటించడంతో బుధవారం ( ఫిబ్రవరి 21) దేశ రాజధాని ఢిల్లీతోపాటు,   సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. టిక్రీ, సింఘూ, ఘాజీపూర్ సరిహద్దల్లో గట్టి నిఘా ఉండేలా సిబ్బందిని మోహరించారు. 

పప్పు ధాన్యాలు, మొక్కజొన్న , పత్తి పంటలను ఐదేళ్లపాటు కనీస మద్దతు ధర ( MSP) కి ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలన్న కేంద్రం ప్రతిపాదనను నిరసన తెలుపుతున్న రైతులు తిరస్కరించారు. అనంతరం ఆదోళనను కొనసాగిస్తామని ప్రకటించారు. శాంతి భద్రత లకోసం భద్రతను భారీ గా మోహరించడంతో ఢిల్లీ -గురుగ్రామ్, ఢిల్లీ-బహదూర్ ఘర్ తో సహా ఇతర రహదారులపై ట్రాఫిక్ నిలిచిపోయింది. 

ఆదివారం (ఫిబ్రవరి 18) రైతు నేతలతో జరిగిన నాలుగో దఫా రైతులతో జరిపిన చర్చల్లో .. ప్రభుత్వ సంస్థల ద్వారా పప్పులు, మొక్కజొన్న, పత్తిని ఐదేళ్లపాటు ఎంఎస్ పీకి కొనుగోలు చేయాలని ముగ్గురు కేంద్ర మంత్రుల బృందం ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదన రైతులకు అనుకూలంగా లేదని రైతు నాయకులు తిరస్కరించారు. దీంతో రైతులు ఢిల్లీ ఛలో మార్చ్ ను పున ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. మూడు సరిహద్దుల వద్ద మోహరించిన భద్రతా సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని మంగళవారం ఢిల్లీ పోలీసులు కోరారు. రాకపోకలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవని తెలిపారు. 

కాగా బుధవారం (ఫిబ్రవరి 21) ఉదయం 11 గంటలకు రైతులు ఢిల్లీ ఛలో మార్చ్ ను కొనసాగించాలని నిర్ణయించారు.