రైతుల వద్ద సాదా బైనామా ఉందా.. పట్టా కోసం దరఖాస్తు చేసుకోండి

రైతుల వద్ద సాదా బైనామా ఉందా.. పట్టా కోసం దరఖాస్తు చేసుకోండి

రైతుల సమావేశంలో మంత్రి హరీష్ రావు సూచన

సంగారెడ్డి : పట్టాలు లేని రైతులంటూ ఎవరూ ఉండరాదని.. సాదా బైనామాతో ఉన్న రైతులు ఈనెల 10వ తేదీలోగా పట్టా కోసం దరఖాస్తు చేసుకోవాలని  మంత్రి హరీష్ రావు సూచించారు.  కంది తహసిల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించిన మంత్రి  సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. అనంతరం జహిరాబాద్ చెరుకు రైతులతో సమావేశమై సమస్యల పై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కొత్త రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్  సిఎం కెసిఆర్ తీసుకొచ్చిన గొప్ప చట్టం.. పారదర్శక పెంచేందుకే కొత్త చట్టం అన్నారు. సాదా బైనామాతో ఉన్న రైతులు పట్టా కోసం 10వ తేదీలోపు సాదా బైనామాల రైతులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏ ఆఫీసు‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా రిజిస్ట్రేషన్, ముటేషన్, పట్టాపాసు బుక్ జారీ అవుతుందని.. ఈ ప్రక్రియ అంతా పదిహేను నిమిషాల్లో ముగుస్తుందని మంత్రి హరీష్ రావు వివరించారు.