గులాబీకి పసుపు టెన్షన్: ఎంపీ కవితను టార్గెట్ చేసిన రైతులు

గులాబీకి పసుపు టెన్షన్: ఎంపీ కవితను టార్గెట్ చేసిన రైతులు

నిజామాబాద్‌‌.. లోక్‌‌సభ ఎన్నికల్లో దేశం దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సెగ్మెంట్‌‌ ఇప్పుడు టీఆర్‌‌ఎస్‌‌కు సవాల్‌‌గామారింది . పసుపు రైతులు మూకుమ్మడిగా నామినేషన్లు వేయడంతో అధికార పార్టీ ఇరుకున పడింది .స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ కుమార్తె, సిట్టింగ్‌‌ ఎంపీ కవిత రెం డోసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటం, రైతులు తిరుగుబాటు బావుటా ఎరగేయడం ఆపార్టీ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. కాంగ్రెస్‌‌ నుంచి మధుయాష్కీ గౌడ్, బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ పోటీలో ఉన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై కన్నా కవిత కాన్సంట్రేషన్‌‌ పూర్తిగా రైతులపైనే కేంద్రీకృతమైంది . ఈ సెగ్మెం ట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే లున్నారు.మిగతా పార్టీలకు లేనంత బలమైన కేడర్ ఉంది .మూడు లక్షల మెజారిటీతో గె లవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ పార్టీకి రైతులు ప్రధాన అవరోధంగా నిలవటం తలనొప్పిగా మారింది.

పట్టించుకోనందుకే పంతం….

పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర ఇప్పించాలని ఈ ప్రాం త రైతులు కొన్నేళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. వాళ్ల డిమాండ్లను పరిష్కరించటంతోపాటు రైతులను శాంతిం పజేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిలైంది . దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు పథకాలు రాష్ట్రం లో అమలు చేసినా .. ఇందూరు రైతులను పట్టించుకోలేదనే అపప్రదను మూటగట్టుకుంది . తమకున్న రాజకీయ బలం, బలగంతో రైతులు నా మినేషన్లు వేయకుండా అడ్డుకోవచ్చని అధికార పార్టీ ముందు నుంచీ కాన్ఫి డెన్స్‌‌తో ఉంది . కానీ స్థా నిక ఎమ్మెల్యేల సముదాయింపులకు రైతులు లొంగకపోవటంతో కథ అడ్డం తిరిగింది. నా మినేషన్‌‌ వేయకుండా కొన్నిచోట్ల టీఆర్ఎస్  లీ డర్లు రైతులను అడ్డుకుంటున్నారనే ప్రచారం మరింత మైనసైంది . ఈ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న మొత్తం 185 మంది అభ్యర్థుల్లో 176 మంది రైతులే ఉన్నారు. 16 సీట్లు గె లుచుకోవాలని టార్గెట్‌‌ పెట్టుకున్న టీఆర్‌‌ఎస్‌‌కు ఇది ఇబ్బందికరంగా మారింది .

రైతులను రెచ్చగొట్టే ప్రచారం…

పసుపు రైతుల్లో ఉన్న వ్యతిరేకతను పోగొడితే విజయం సాధిం చవచ్చని ఎంపీ కవిత భావిస్తున్నారు. అందుకే పసుపు రైతుల సమస్యలపై తాను ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నాలను ప్రచారాస్త్రంగా ఎంచుకున్నారు. తన ప్రచార సభల్లో, రోడ్ లో వీటినే ఫోకస్ చేస్తున్నారు. పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం స్పందించక  పోతే పార్లమెం టులో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గడచిన అయిదేళ్లలో తానెన్ని సార్లు కేంద్రానికి లేఖలు రాశానో  రైతులకు వివరిస్తున్నారు. మరోవైపు రైతుల ఐక్యతను విడదీసేందుకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని టీఆర్‌‌ఎస్‌‌ పావులు కదుపుతోంది . అందులోభాగంగానే పోటీలో ఉన్న వారిలో అసలు రైతులెవరూలేరని తిప్పికొట్టే ప్రచారాన్ని ఆ పార్టీ నేతలు ఎంచుకున్నారు.

డిమాండ్లు .. టార్గెట్…

కవిత ఎంపీగా ఉన్న కాలంలోనూ తమకు న్యాయం జరగలేదని, తమ సమస్యను కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసేలా చేయాలని పసుపు రైతులు పట్టుదలతో ఉన్నారు. పసుపుకు క్వింటాల్‌‌కు15 వేల రూపాయలు,ఎర్రజొన్నకు క్వింటాల్‌‌కు 3,500 రూపాయలు మద్దతు ధరతోపాటు పసుపు బోర్డు ఏర్పాటు..పోటీలో ఉన్న రైతుల ప్రధాన డిమాండ్ లివే!

ఎన్ని కల్లో అధికార పార్టీని దెబ్బ కొట్టడం ద్వా రా ప్రభుత్వాలు కళ్లు తెరిచేలా చేయాలనేది వారి వ్యూహం. ‘మా సత్తా ఏంటో చూపిస్తాం. ఈ ఎన్ని కల్లోనే కాదు. వచ్చే ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇలాగే సంఘటితంగా పోటీ చేస్తాం..’ అని పోటీలో ఉన్న రైతులు చెబుతున్నారు.

జగిత్యాల, బాల్కొండ రైతులే ఎక్కువ….

నిజామాబాద్‌‌ పార్లమెంట్‌‌ స్థానానికి నామినేషన్లు వేసిన 176 మంది రైతుల్లో జగిత్యాల జిల్లాకు చెందిన రైతులు ఎక్కువగా ఉన్నారు. అత్యధికంగా జగిత్యాల నుంచి 66 మంది , బాల్కొండ సెగ్మెంట్‌‌కు చెందిన 61 మంది పోటీలో ఉన్నారు. ఆర్మూర్‌‌ నుంచి 23 మంది , నిజామాబాద్‌‌ రూరల్‌‌ నియోజకవర్గం నుంచి 24 మంది రైతులున్నారు. మిగతా ఇద్దరు బోధన్‌‌ నిజామాబాద్‌‌కు చెంది నవారు.

ఒత్తిడిలో మంత్రి ప్రశాంత్‌ రెడ్డి…

సిట్టింగ్ ఎంపీ కవితను భారీ మెజారిటీతో గెలిపించే బాధ్యతను కేసీఆర్ తనకు నమ్మకస్తుడైన మంత్రి ప్రశాంత్‌ రెడ్డికి అప్పగించారు. ప్రశాంత్‌ రెడ్డి ప్రయత్నాలకు పసుపు రైతులు మొదట్లోనే గండి కొట్టారు.ఆయన సొంత నియోజకవర్గం నుంచే ఎక్కువ మంది రైతులు నా మినేషన్లు దాఖలు చేయటం, నేతల మధ్య సమన్వయ లోపంతో మంత్రి పరేషాన్‌‌లో పడ్డారని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.