మనదేశంలో ఇష్టమైనది తినే, ధరించే హక్కు ఉంది

మనదేశంలో ఇష్టమైనది తినే, ధరించే హక్కు ఉంది

కర్నాటకలో తలెత్తిన హిజాబ్ అంశంపై దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా హిజాబ్ విషయంలో స్పందించారు జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూ్ం అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరికి తమ ఇష్టానుసారంగా ధరించే హక్కు, తినే హక్కు ఉందన్నారు. వారి మత విశ్వాసాలను ఆచరించడానికి స్వేచ్ఛ ఉందన్నారు. మత ప్రాతిపదికన ప్రజలను విభజించి తద్వారా ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నంలో కొంతమంది రాడికల్ ఎలిమెంట్స్ ఉన్నారని ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు. అంతకుముందు ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ ..హిజాబ్ ధరించడంలో తప్పు ఏమీ లేదన్నారు. భారతదేశం ఒక స్వేచ్ఛా దేశమన్నారు. అమ్మాయి హిజాబ్ ధరించాలా వద్దా అన్న విషయం ఆమె నిర్ణయించుకోవాలన్నారు. ఇది ఎవరికీ హాని కలిగించదన్నారు. 

డీలిమిటేషన్ కమిషన్ నివేదికపై అబ్దుల్లా మాట్లాడుతూ ఈ రిపోర్ట్ సరికాదన్నారు.  ఫిబ్రవరి 14లోపు సరైన నివేదిక సమర్పిస్తామన్నారు. పాకిస్తాన్, ఇండియా మధ్య ద్వేషం అంతమై.. మంచి సంబంధాలు ఏర్పడాలని ఆశించారు. ఆఫ్ఘనిస్తాన్ ఒక ప్రత్యేక దేశం, అందరికీ న్యాయం చేయగల ఇస్లామిక్ పాలనను ఏర్పాటు చేయాలని మేము ప్రార్థిస్తున్నామని ఫరూక్ అబ్దుల్లా అన్నారు.