వరల్డ్ ఈవెంట్స్ ఎకానమీ వీక్ (డబ్ల్యూఈఈడబ్ల్యూ) 2026లో భాగంగా మాదాపూర్ హైటెక్స్ లో బుధవారం నిర్వహించిన గాలా, ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. తెలంగాణ టూరిజం, హైటెక్స్, తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఈఐ) నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు మోడల్స్ ర్యాంప్ వాక్ తో సందడి చేశారు. రెడ్ కార్పెట్, డాజిల్ ఫ్యాషన్ షో అలరించాయి. ఈవెంట్ డెస్టినేషన్‌గా హైదరాబాద్‌కు ఖ్యాతి పెరుగుతుందని టీసీఈఐ ప్రెసిడెంట్ బలరాం బాబు తెలిపారు.
మాదాపూర్, వెలుగు
