
టోల్ గేట్ గుండా ప్రయాణించే వాహనదారుల కోసం కేంద్రం వార్షిక పాస్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ (FASTag Annual Pass) లను ఆగస్టు 15 నుంచి అందుబాటులో కి తెచ్చింది. 3వేల రూపాయల ఖర్చుతో సంవత్సరం పొడవునా జాతీయ రహదారుల మీదుగా ప్రయాణించవచ్చు. లేదా 200 ట్రిప్పులు ఉచితంగా ప్రయాణించవచ్చు.
అయితే ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ కేవలం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనినేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) హైవేలపై మాత్రమే పనిచేస్తుంది. రాష్ట్రప్రభుత్వం అధికారులు నిర్వహించే హైవేలు, ఎక్స్ ప్రెస్ వేలు, ఔటర్ రింగురోడ్డులలో చెల్లుబాటు కాదు.
తెలంగాణలోని కొన్ని హైవేలపై మాత్రమే ఈ ఫాస్టాగ్ వార్షిక పాస్ చెల్లుతుంది. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే నేషనల్ హైవే 65 పై ఈ ఫాస్టాగ్ వార్షిక పాస్ చెల్లుతుంది. అలాగే హైదరాబాద్ టు జడ్చర్ల హైవే పై టోల్ గేట్ల దగ్గర కూడా చెల్లుబాటు అవుతుంది.
తెలంగాణలో ఈ మార్గాల్లో ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ చెల్లదు.. టోల్ ఛార్జీలు చెల్లించాల్సిందే
రాష్ట్ర రహదారి 1 హైదరాబాద్ - కరీంనగర్ - రామగుండం రంగారెడ్డి, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో
రాష్ట్ర రహదారి 2 నార్కట్‌పల్లి - మిర్యాలగూడ - నాగార్జునసాగర్ నల్గొండ జిల్లాలో
రాష్ట్ర రహదారి 3 వరంగల్ - నర్సింహులపేట క్రాస్ రోడ్ - ఖమ్మం వరంగల్, ఖమ్మం జిల్లాలో
రాష్ట్ర రహదారి 4 హైదరాబాద్ - చేవెళ్ల - పరిగి - కొడంగల్ రంగారెడ్డి
రాష్ట్ర రహదారి 6 హైదరాబాద్ - మెదక్ - బోధన్ రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్
రాష్ట్ర రహదారి 11 కరీంనగర్ - కామారెడ్డి - ఎల్లారెడ్డి కరీంనగర్ - నిజామాబాద్
రాష్ట్ర రహదారి 12 భద్రాచలం - జగన్నాధపురం ఖమ్మం
రాష్ట్ర రహదారి 15 సిద్దిపేట - రామాయంపేట - మెదక్ మెదక్
రాష్ట్ర రహదారి 17 భువనగిరి - నర్సాపూర్ - సంగారెడ్డి నల్గొండ, మెదక్
రాష్ట్ర రహదారి 18 నల్గొండ - మల్లేపల్లి - జడ్చర్ల నల్గొండ, మహబూబ్‌నగర్
రాష్ట్ర రహదారి 19 హైదరాబాద్ - ఇబ్రహీంపట్నం - కొండమల్లేపల్లి - నాగార్జున సాగర్ నల్గొండ, మహబూబ్‌నగర్
రాష్ట్ర రహదారి 20 మహబూబ్ నగర్ - భూత్‌పూర్ - బిజ్నాపల్లి - శ్రీశైలం మహబూబ్‌నగర్
రాష్ట్ర రహదారి 21 జడ్చర్ల - దేవునిపాలెం - వనపర్తి - కొత్తకోట మహబూబ్‌నగర్
రాష్ట్ర రహదారి 23 మహబూబ్ నగర్ - కొడంగల్ - తాండూరు - పొలకపల్లి మహబూబ్‌నగర్
రాష్ట్ర రహదారి 24 నిర్మల్ - జన్నారం - జాతీయ రహదారి ఆదిలాబాదు
ఆగస్టు 15నుంచి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రారంభించిన FASTag వార్షిక పాస్ అమలు చేస్తుంది. ప్రైవేట్ వాహన యజమానులకు ఎంపిక చేసిన జాతీయ రహదారులు (NH) ,జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలు (NE) లలో ప్రయాణించడానికి అనుకూలమైన ప్రీపెయిడ్ టోల్ ఎంపిక ఇది. రూ. 3వేల వన్-టైమ్ ఫీజుతో, వినియోగదారులు ఒక సంవత్సరంలో 200 వరకు టోల్-ఫ్రీ ట్రిప్పులు చేయవచ్చు లేదా ఒక సంవత్సరం పాటు ప్రయాణించవచ్చు. అయితే, ఈ పాస్ అన్ని హైవేలు లేదా ఎక్స్‌ప్రెస్‌వేలలో ముఖ్యంగా రాష్ట్ర అధికారులు నిర్వహించే వాటిలో చెల్లుబాటు కాదు. ఈ మినహాయించబడిన మార్గాల్లో టోల్‌లను సాధారణ FASTag ఖాతా ద్వారా చెల్లించాలి.
FASTag వార్షిక పాస్ ప్రత్యేకంగా జాతీయ రహదారులు ,కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న ఎక్స్‌ప్రెస్‌వేల కోసం రూపొందించారుు. అందువల్ల రాష్ట్ర నిర్వహణ మార్గాలపై టోల్‌లు ఈ పథకంలో చేర్చలేదు.