ఇయ్యాల్టి నుంచి ఫాస్టాగ్ లేకపోతే డబుల్ టోల్

ఇయ్యాల్టి నుంచి ఫాస్టాగ్ లేకపోతే డబుల్ టోల్

నేటి నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి…
లేకపోతే డబుల్ ఫీజు వసూలు

దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అన్ని నేషనల్ హైవేలపై ఫాస్టాగ్ పూర్తి స్థాయిలో అమలు కానుంది. ఇయ్యాల్టి నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఫాస్టాగ్ లేకపోతే డబుల్ టోల్ వసూల్ చేస్తామని చెప్పింది. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ ఆదివారం అన్ని రాష్ట్రాల నేషనల్ హైవే రీజనల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

న్యూఢిల్లీ: అన్ని నేషనల్ హైవేలపైన ఉన్న టోల్ ప్లా జాల్లో సోమవారం నుంచి ఫాస్టాగ్ ద్వారా మాత్రమే టోల్ పేమెంట్ ను అనుమతిస్తారు. ప్లాజాలోకి వచ్చే వెహికల్ కు ఫాస్టాగ్ లేకపోతే సాధారణ ఫీజుకు రెండు రెట్లు ఎక్కువ వసూలు చేస్తామని కేంద్ర రోడ్ ట్రాన్స్​పోర్ట్​ మినిస్ట్రీ ప్రకటిం చింది. టోల్ ప్లాజాల వద్ద వెయిటింగ్ టైమ్ ను తగ్గించడానికి, డిజిటల్ పేమెంట్స్​ను ఎంకరేజ్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఫాస్టాగ్ వల్ల వెహికల్స్​ త్వరగా వెళ్లిపోతాయి కాబట్టి ఫ్యూయల్ ఆదా అవుతుందని పేర్కొంది. ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ గడువును ఇక నుంచి పొడగించడం కుదరదని, ఇది వరకే మూడుసార్లు పొడగించామని స్పష్టం చేసింది.