దేశంలో కరోనా విజృంభణ..వేగంగా పెరుగుతున్న కేసులు

దేశంలో కరోనా విజృంభణ..వేగంగా పెరుగుతున్న కేసులు
  • 24 గంటల్లో 1,038 మంది మృతి
  • 9 రోజుల్లోనే 10 లక్షలకు పైగా కొత్త కేసులు
  • నీట్‌ పీజీ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ వాయిదా వేసిన కేంద్రం 
  • స్మారక కట్టడాలు, మ్యూజియాలు మే 15 వరకు క్లోజ్‌
  • జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న మహారాష్ట్ర


సెకండ్‌ వేవ్‌లో కరోనా విజృంభిస్తోంది. కేసులు, మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇటు ట్రీట్‌మెంట్‌ చేయించుకోవడానికి ఆస్పత్రులు సరిపోవట్లేదు. అటు అంత్యక్రియలకు శ్మశానాల్లో జాగా దొరకట్లేదు. ఓవైపు బెడ్లు లేక హాస్పిటళ్ల బయట అంబులెన్సుల్లోనే గంటలు గంటలు రోగులు వెయిట్‌ చేయాల్సి వస్తోంది. మరోవైపు శ్మశానాలు నిండిపోతుండటంతో దహన సంస్కారాలకు కూడా బంధువులు గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. పరిస్థితి చేయిదాటిపోతుండటం, కేసులు పెరుగుతుండటంతో అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు, కర్ఫ్యూలు పెడుతున్నారు. బయట గుమిగూడి తిరగొద్దని, వేడుకలు వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు. బోర్డు పరీక్షలు, ఎంట్రెన్స్​ ఎగ్జామ్‌లు రద్దు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నడుమ మళ్లీ లాక్‌డౌన్‌ పెడ్తారేమోనని వలస కూలీలు సొంతూర్లకు పయనమవుతున్నారు.


కరోనా సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భయపెడుతోంది. దేశంలో గత 24 గంటల్లోనే 2,00,739 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బారిన పడి 1,038 మంది చనిపోయారు. డైలీ కేసులు పది రోజుల్లోనే లక్ష నుంచి 2 లక్షలకు చేరాయి. గత 9 రోజుల్లోనే 10 లక్షలకు పైగా కొత్త కేసులు రికార్డయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసులు 1,40,74,564కు.. మరణాలు 1,73,123కు పెరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. రోజువారీ కేసులు 10 రాష్ట్రాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పింది. గత 24 గంటల్లో నమోదైన 2 లక్షల కేసుల్లో 80 శాతం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఢిల్లీ, చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కర్నాటక, మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కేరళ, తమిళనాడు, గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలోనే ఉన్నాయంది. మహారాష్ట్రలో ఒక్కరోజే 58,952 మందికి పాజిటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేలిందని.. ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 20,439, ఢిల్లీలో 17,282 కేసులు రికార్డయ్యాయని తెలిపింది.

14 లక్షల యాక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులు

ప్రస్తుతం దేశంలో 14.71 లక్షల యాక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులున్నాయని, ఇవి మొత్తం కేసుల్లో 10.46 శాతమని కేంద్రం తెలిపింది. రికవరీ రేటు తగ్గుతూ వస్తోందని, ప్రస్తుతం 88.31 శాతం దగ్గర ఉందని చెప్పింది. ప్రస్తుతమున్న యాక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసుల్లో 67 శాతం మహారాష్ట్ర, చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కర్నాటక, కేరళల్లోనే ఉన్నాయంది. ఒక్క మహారాష్ట్రలోనే 43 శాతం కేసులున్నాయని చెప్పింది. 24 గంటల్లో నమోదైన మరణాల్లో 82 శాతం 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయంది. ఒక్క మహారాష్ట్రలోనే 278 మంది చనిపోయారంది. తర్వాత చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 120, ఢిల్లీలో 104, గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 73, ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 67, పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 63 మంది మరణించారని తెలిపింది. గత 24 గంటల్లో 93,528 మంది కరోనా నుంచి రికవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారని, దీంతో కరోనా నుంచి కోలుకున్న వాళ్ల సంఖ్య 1.2 కోట్లకు చేరిందని తెలిపింది. ఐసీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకారం ఇప్పటివరకు 26.2 కోట్ల శాంపుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరీక్షించారు. ఇప్పటివరకు 11.44 కోట్ల వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డోసులు వేసినట్టు కేంద్రం వెల్లడించింది. 
 
ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4న లక్ష.. 14న 2 లక్షలు

దేశంలో డైలీ కరోనా కేసులు కేవలం10 రోజుల్లోనే లక్ష నుంచి 2 లక్షలకు చేరుకున్నాయి. ఈ ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4న లక్ష కేసులు రికార్డవగా ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 14న ఒకే రోజు 2 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. కరోనా ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 8,100 కేసుల నుంచి 97 వేల కేసులకు చేరుకోవడానికి 110 రోజులు పట్టగా సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 8,600 కేసుల నుంచి 2 లక్షలకు చేరుకోవడానికి 72 రోజులే పట్టింది.   
  
కుంభమేళాలో 1,701 మందికి కరోనా

ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని హరిద్వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్న కుంభమేళాకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. దీంతో కరోనా బారిన పడుతున్న వాళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది. కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 10 నుంచి 14 వరకు 2,36,751 శాంపుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరీక్షించగా 1,701 మందికి పాజిటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తేలిందని అధికారులు వెల్లడించారు. భక్తులతో పాటు కొందరు సాధువులకూ టెస్టులు చేశామన్నారు. కొన్ని పరీక్షల రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావాల్సి ఉందని, కేసులు 2 వేలు దాటొచ్చని చెప్పారు. మహా కుంభమేళా ఈ నెల 30 వరకు కొనసాగుతుందని తెలిపారు.  

మహారాష్ట్రలో 15 రోజుల్లో కేసులు డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఉద్ధవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
 
మహారాష్ట్రలో యాక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులు మరో 15 రోజుల్లో రెండింతలు అవుతాయని ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఠాక్రే చెప్పారు. ప్రస్తుతమున్న 5.64 లక్షల యాక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులు ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 30 కల్లా 11.9 లక్షలకు చేరుతాయన్నారు. ఈ మేరకు కేంద్రానికి ఆయన లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాశారు. రాష్ట్రంలో మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరుగుతోందని, ప్రస్తుతం రోజుకు 1,200 టన్నుల ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవసరమవుతోందని, ఇది ఈ నెలాఖరు కల్లా 2 వేల టన్నులకు చేరుకుంటుందని చెప్పారు. పక్క రాష్ట్రాల్లో  మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరఫరా చేసేంత స్థాయిలో లేదని.. కాబట్టి తూర్పు, దక్షిణ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని స్టీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాంట్ల నుంచి లిక్విడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విమానాల్లో తెప్పించేందుకు నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిజాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని కోరారు. కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించాలని,  అలా ప్రకటిస్తే డిజాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రాష్ట్రాలు వాడుకోవచ్చని, లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిలీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద అంత్యోదయ అన్న యోజన లబ్ధిదారులు, రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డు ఉన్న వాళ్లకు పెద్దలకు రోజకు రూ. 100, పిల్లలకు రూ. 60 ఇవ్వొచ్చని చెప్పారు. 
  
ముంబై, ఢిల్లీల్లో స్టార్ హోటళ్లు.. కరోనా హాస్పిటళ్లు

ముంబైలోని స్టార్ హోటళ్లను కొవిడ్ ఆస్పత్రులుగా మార్చాలని ముంబై మున్సిపల్‌కార్పొరేషన్‌ నిర్ణయించింది. మైల్డ్‌ లక్షణాలున్న పేషెంట్లకు ట్రీట్‌మెంట్‌ చేయడానికి లగ్జరీ హోటళ్లతో హాస్పిటళ్లు ఒప్పందం చేసుకుంటాయని చెప్పింది. ఢిల్లీలోని 15 హోటళ్లను కూడా తాత్కాలిక కరోనా ఆస్పత్రులుగా మార్చుతున్నారు. వీటిని ప్రైవేట్ ఆస్పత్రులకు అనుసంధానం చేస్తారు. తక్కువ లక్షణాలతో వచ్చే కరోనా రోగులను ఇక్కడ అడ్మిట్ ట్రీట్‌మెంట్‌ చేస్తారు. పరిస్థితి విషమిస్తే ఆస్పత్రికి తరలిస్తారు.
   
పరిస్థితి ఆందోళనకరంగా ఉంది: గడ్కరీ

కరోనాను ఎదుర్కోవడానికి లాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి నితిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గడ్కరీ చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఇలా ఎంతకాలం ఉంటుందో చెప్పలేమని అన్నారు. నాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం 40 టన్నుల ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను భిలాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి తెప్పిస్తున్నట్టు వెల్లడించారు. విశాఖపట్నం నుంచీ ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకురావడానికి ఏర్పాట్లు చేశామన్నారు. వెయ్యి వెంటిలేటర్లు విశాఖ నుంచి వస్తాయని తెలిపారు. 

ఢిల్లీలో ఒక్కరోజే 17 వేల కేసులు

కరోనా నాలుగో వేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఢిల్లీని కలవరపెడుతోంది. రోజువారీ కేసులు ముంబై నగరానికి మించి నమోదవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 17 వేల కొత్త కేసులు రికార్డయ్యాయి. వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బారిన పడి 104 మంది చనిపోయారు. కేసులు, మరణాలు పెరుగుతుండటంతో వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్టడికి వీకెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కర్ఫ్యూ విధిస్తున్నట్టు ఢిల్లీ సర్కారు వెల్లడించింది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు. ‘కర్ఫ్యూ వల్ల ప్రజలు ఇబ్బంది పడతారని తెలుసు. కానీ వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యాప్తిని అడ్డుకోవాలంటే తప్పదు’ అన్నారు. కర్ఫ్యూ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, మాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆడిటోరియంలు, స్పా సెంటర్లు మూసి ఉంటాయన్నారు. రెస్టారెంట్లలో హోం డెలివరీకే అనుమతి ఉంటుందని చెప్పారు. సినిమా థియేటర్లను 30 శాతం కెపాసిటీతో నడపాలన్నారు. ముందే నిర్ణయించిన పెండ్లిళ్లకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. రైల్వే స్టేషన్లు, పెండ్లిళ్లు, హాస్పిటళ్లు, ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులకు వెళ్లే వాళ్లకు కర్ఫ్యూ పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఇస్తామన్నారు. 

స్టూడెంట్ల ఆరోగ్యం దృష్ట్యా నీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీజీ వాయిదా: కేంద్రం 

కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ నెల 18న జరగాల్సిన నీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీజీ మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంట్రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్విట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా వెల్లడించారు. యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్ల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పరిస్థితిని బట్టి పరీక్ష కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. దేశంలోని మ్యూజియాలు, స్మారక కట్టడాలను మే 15వ తేదీ వరకు మూసేస్తున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్కియాలజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వే ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా ప్రకటన విడుదల చేసింది.