డోప్ టెస్ట్లో దొరికిన భారత అథ్లెట్ ద్యుతిచంద్..నాలుగేళ్ల నిషేధం..

డోప్ టెస్ట్లో దొరికిన భారత అథ్లెట్ ద్యుతిచంద్..నాలుగేళ్ల నిషేధం..

డోపింగ్ టెస్ట్ విఫలమైన భారత అథ్లెట్ ద్యుతీ చంద్ పై నిషేధం పడింది.  డోపింగ్ టెస్ట్ లో దొరికిపోయిన ద్యుతి చంద్ పై నాలుగేళ్ల నిషేధం విధించారు. భువనేశ్వర్‌లోని నాడా డోప్ కంట్రోల్ అధికారులు ద్యుతిని రెండుసార్లు పరీక్షించగా.. ఉత్పేరకాలు తీసుకు న్నట్లు గుర్తించారు డోపింగ్ కంట్రోల్ అధికారులు. దీంతో భారత స్టార్ అథ్లెట్,100 మీటర్ల జాతీయ రికార్డును సొంత చేసుకున్న ద్యుతి చంద్ పై  నిషేధం  విధించారు. 
2018 జకార్తా ఆసియా క్రీడల్లో 100 మీ,200 మీటర్ల రేసుల్లో డబుల్ రజత పతక విజేత అయిన ద్యుతి.. ఉత్పేరకాల తీసుకొని పోటీల్లో పాల్గొందన్న ఆరోపణలతో సెలక్టివ్ ఆండ్రోజెన్ రిసెప్టర్ మాడ్యులేటర్స్ గతేడాది డిసెంబర్ 5, 26 తేదీల్లో  రెండు రెండు టెస్ట్ లు నిర్వహించింది. ఆమె మొదటి నమూనాలో అనాబాలిక్ ఏజెంట్లు అండరైన్, ఓస్టారిన్ ,లిగాండ్రోల్ ఉత్పేరకాలను తీసుకున్నట్లు గుర్తించారు. రెండవ నమూనాలో ఆండరైన్, ఓస్టారిన్ మూలాలు ఉన్నాయని డోప్ కంట్రోల్ అధికారులు తెలిపారు.  దీంతో జనవరి 3 నుంచి నిషేధం  విధించారు.
 ద్యుతి నుంచి నమూనా సేకరించిన తేది డిసెంబర్ 5 నుంచి పాల్గొన్న అన్ని పోటీలకు ఆమె అనర్హురాలని.. సాధించిన  పతకాలు, పాయింట్లు, బహుమతులు జప్తు చేస్తామని యాంటీ డోపింగ్ డిసిప్టినరీ ప్యానెల్ (ADDP)తెలిపింది.