ఉగాండాలో ఘోర ప్రమాదం.. 46 మంది మృతి

ఉగాండాలో ఘోర ప్రమాదం.. 46 మంది మృతి

కంపాల: ఉగాండా రాజధాని కంపాలలో ఘోర ప్రమాదం జరిగింది. కంపాల – గులు హైవేపై పలు వాహనాలు ఢీకొనడంతో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 63 మంది చనిపోయారని మొదట పోలీసులు పేర్కొన్నప్పటికీ..  తర్వాత దానిని 46కు సవరించారు. ప్రమాదం స్థలంలో కొంతమంది బతికే ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. 

కిర్యాండోంగో జిల్లాలోని కంపాల– గులు హైవేపై పలు వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం (అక్టోబర్ 21) అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. గులు హైవేపై ఓ బస్సు డ్రైవర్‌‌ లారీని ఓవర్‌‌ టేక్‌‌ చేస్తూ.. ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టారు. వెంటనే డ్రైవర్‌‌ బస్సును మరో వైపునకు తిప్పడంతో  ఎదురుగా వస్తున్న రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. 

దీంతో అదుపు తప్పిన పలు వాహనాలు వరుసగా ఢీకొట్టుకొని బోల్తా పడ్డాయి. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కిర్యాండోంగో పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ఓవర్‌‌ టేకింగ్‌‌ చేస్తుండమేనని.. వాహనదారులు రోడ్లపై వాహనాలను జాగ్రత్తగా నడపాలని అక్కడి ప్రజలను కోరారు.