వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం.. బైకును 200 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ

వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం.. బైకును 200 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ

వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని సయ్యద్ మల్కాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న లారీ ఓ బైక్‎ని ఢీకొట్టి దాదాపు 200 మీటర్ల దూరం వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. దీంతో బైకుపై ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో లారీలో బైక్ ఇరుక్కోవడంతో పెట్రోల్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో అటుగా వెళుతున్న ప్రయాణికులు మంటలను చూసి భయందోళనకు గురై పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. 

ALSO READ | దేశం షాక్ అయ్యింది : కొరియర్ అంటూ వచ్చాడు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై పెప్పర్ స్ప్రే చల్లి అత్యాచారం

ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పివేశారు. గాయపడ్డవారిని దోమ మండలం బాస్పల్లి గ్రామానికి చెందిన రాఘవేందర్, నర్సింలుగా పోలీసులు గుర్తించారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వికారాబాద్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారణమైన లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని.. ప్రమాదం జరగగానే లారీని వదిలి పరారయ్యాడని స్థానికులు తెలిపారు. ప్రమాదం పరిగి-షాద్నగర్ ప్రధాన రహదారిపై జరగడంతో వాహనాలు భారీ ఎత్తున స్తంభించి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.