ఘోర ప్రమాదం.. 50 మందితో వెళ్తున్న బస్సు బోల్తా..

ఘోర ప్రమాదం.. 50 మందితో వెళ్తున్న బస్సు బోల్తా..

నిర్మల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్స్ పై ముస్కాన్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా  పడింది. 50 మంది ప్రయాణికులతో ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న 50 మందిలో 25 మందికి గాయాలయ్యాయి. యాక్సిడెంట్ పై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

 విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ తరలిస్తుండగా ఫర్హానా అనే మహిళ మృతి చెందింది. మృతురాలు అదిలాబాద్ వాసిగా గుర్తించారు పోలీసులు. ప్రమాదం అర్థరాత్రి జరగడంతో సహాయక చర్యలు ఆలస్యమైనట్టు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని నిర్మల్ జిల్లా పోలీసులు తెలిపారు.