ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం సాగర్ ప్రధాన రహదారి గురునానక్ కాలేజీ దగ్గర కారు, బైకును ఢీ కొట్టింది. బైక్ పైన ముగ్గురు వ్యక్తుల్లో జక్కుల లింగం (32) మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో నగరంలోని నిమ్స్ హాస్పిటల్కి తరలించారు.
ఇబ్రహీంపట్నం మండలం పెత్తుల గ్రామానికి చెందిన జక్కుల లింగం, బండి సుధాకర్, నాగేష్ ముగ్గురు నగరంలో పనులు ముగించుకొని గ్రామానికి వెళుతుండగా గురునానక్ కాలేజ్ వద్ద యాచారం నుంచి ఇబ్రహీంపట్నం వైపు వస్తున్న కారు అతివేగంగా బైకును ఢీకొట్టడంతో అక్కడికక్కడే జక్కుల లింగం మృతి చెందారు.
ఒకరినికి తీవ్ర గాయాలు కావడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇబ్రహీంపట్నంలోనీ నిమ్స్ హాస్పిటల్ కి తరలించారు, మరొకరిని నగరంలోని నిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాద ఛాయలో అలుముకున్నాయి. అతి వేగంగా నిర్లక్ష్యంగా కారును నడిపిన వ్యక్తిని ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
