తొగుట : సిద్దిపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు చనిపోయారు. మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన చల్మెడ కుమారచారి(39), హైదరాబాద్ లో కార్పెంటర్. కాగా.. సంక్రాంతికి కుటుంబంతో సొంతూరు వెళ్లాడు. శనివారం సాయంత్రం అతను తన బైక్ పై కొడుకు సుశాంత్( 8), మేన కోడలు రమ్యశ్రీ(7) తో కలిసి హైదరాబాద్ కు బయలుదేరారు. తొగుట మండలం జప్తిలింగారెడ్డిపల్లి శివారులో ఎదురుగా వచ్చే లారీని ఢీకొట్టాడు. దీంతో బాలుడు సుశాంత్ స్పాట్ లో చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన కుమారచారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. రమ్యశ్రీకి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసి తొగుట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తండ్రీకొడుకు మృతితో ధర్మారంలో విషాదం నెలకొంది.
