యుద్ధవిమానాన్ని నడిపి చరిత్ర సృష్టించిన తండ్రీకూతుళ్లు

యుద్ధవిమానాన్ని నడిపి చరిత్ర సృష్టించిన తండ్రీకూతుళ్లు

ఎయిర్ కమాండర్​ సంజయ్ శర్మ , అతని కుమార్తె ఫ్లయింగ్ ఆఫీసర్ అనన్య శర్మ కలిసి ఫైటర్ జెట్‌ను నడిపారు. దీంతో యుద్ధవిమానాన్ని  నడిపిన  తండ్రీకూతుళ్లుగా  వారు చరిత్ర సృష్టించారు. మే 30వ తేదీన కర్ణాటక బీదర్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో హాక్-132 ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఈ తండ్రీకూతుళ్లు ప్రయాణించి చరిత్ర సృష్టించారు. ఇద్దరు కలిసి యుద్ధ విమానం ముందు దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో  తెగ చక్కర్లు కొడుతున్నాయి. అనన్య తండ్రి  సంజయ్ శర్మ 1986లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరారు. ఆయన అడుగుజాడల్లోనే అనన్య  కూడా  చేరి దేశానికి సేవలందించాలనుకుంది. తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకుంది.  ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బీటెక్ పూర్తి చేసిన అనన్య  వైమానిక దళం మొదటి మహిళా ఫైటర్ ఫైలట్ల టీమ్(2016) లో చోటు సంపాదించుకుంది.  అనంతరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ బ్రాంచ్‌ లో శిక్షణ తీసుకుంది.  డిసెంబర్ 2021లో ఫైటర్ పైలట్‌గా నియమితురాలైంది. అనన్య ప్రస్తుతం బీదర్‌ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో శిక్షణ పొందుతోంది.