ఫియర్ మొదలైంది.. ఆడియన్స్ థ్రిల్ అవడం గ్యారంటీ

ఫియర్ మొదలైంది.. ఆడియన్స్ థ్రిల్ అవడం గ్యారంటీ

వేదిక(Vedika) హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ఫియర్‌‌‌‌‌‌‌‌(Fear). అరవింద్ కృష్ణ(Aravind Krishna) ప్రత్యేక పాత్రలో నటిస్తుండగా హరిత గోగినేని(Hritha Gogineni) దర్శకత్వం వహిస్తోంది. దత్తాత్రేయ మీడియా బ్యానర్‌‌‌‌‌‌‌‌పై ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్. బుధవారం రామానాయుడు స్టూడియోస్‌‌‌‌లో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. అతిథులుగా హాజరైన మురళీ మోహన్ స్క్రిప్ట్‌‌‌‌ను మేకర్స్​కు అందించగా, దర్శకుడు కరుణాకరన్ క్లాప్ నిచ్చారు. హీరో సోహైల్, డైరెక్టర్ తేజ కాకుమాను తదితరులు పాల్గొని బెస్ట్ విషెస్ చెప్పారు.

అనంతరం హీరోయిన్ వేదిక మాట్లాడుతూ ‘ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్. నా క్యారెక్టర్ మల్టీ డైమెన్షన్స్‌‌‌‌తో ఉంటుంది. కొత్త డైరెక్టర్ అయినప్పటికీ హరిత ఎంతో క్లారిటీగా, ఎడ్జ్ ఆఫ్ సీట్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గా స్క్రిప్ట్ రెడీ చేశారు. కథ వినగానే ఇంప్రెస్ అయ్యాను. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’ అని చెప్పింది. ‘ఈ సినిమాలో పార్ట్ అ‌‌‌‌వడం, వేదిక గారితో కలిసి పనిచేయడం హ్యాపీగా ఉంది’ అన్నాడు అరవింద్ కృష్ణ.

‘ప్రేక్షకులకు నచ్చే సినిమా తీయాలని ఏడాదిపాటు వర్క్ చేసి ఈ స్క్రిప్ట్‌‌‌‌ రెడీ చేశాను. వేదిక లాంటి హీరోయిన్ లభించడం సంతోషం’ అని డైరెక్టర్ హరిత చెప్పింది. నిర్మాత ఏఆర్ అభి మాట్లాడుతూ ‘దర్శకురాలు హరిత నా భార్య. మేము గతంలో తీసిన ‘లక్కీ లక్ష్మణ్‌‌‌‌’ చిత్రానికి వర్క్ చేసింది. ‘ఫియర్‌‌‌‌‌‌‌‌’ స్క్రిప్ట్​ను చాలా బాగా రాసుకుంది. వేదిక ఇందులో చాలెంజింగ్ క్యారెక్టర్ లో కనిపించబోతోంది’ అని చెప్పారు. సినిమాటోగ్రాఫర్ ఐ ఆండ్రూ తదితరులు పాల్గొన్నారు.