స్మార్ట్‌ఫోన్ కన్నా ఫీచర్‌ ఫోనే బెస్ట్‌! ఎందుకు? ఎలా?

స్మార్ట్‌ఫోన్ కన్నా ఫీచర్‌ ఫోనే బెస్ట్‌! ఎందుకు? ఎలా?

స్మార్ట్‌ ఫోన్ల వాడకంతో ఎన్ని ప్రయోజనాలున్నా, కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. హ్యాకింగ్‌, ప్రైవసీ లేకపోవడమే ప్రధాన సమస్యలు. ఈ మధ్య వాట్సాప్‌‌కు ‘పెగాసస్‌‌’ ఎలాంటి ముప్పుగా మారిందో అందరికీ తెలిసిందే. ఇది మాత్రమే కాదు.. రకరకాల మాల్‌ వేర్‌‌‌‌లు యాప్స్‌ ద్వారా స్మార్ట్‌ ఫోన్లలోకి ప్రవేశించి, యూజర్ల డాటాను హ్యాక్‌‌ చేస్తున్నాయి. ఇక చాలా సోషల్‌ మీడియా యాప్స్‌ ద్వారా యూజర్ల వ్యక్తిగత వివరాలు హ్యాకర్లకు అందుతున్నాయి . కొన్ని సంస్థలైతే నేరుగా డాటాను అమ్ముకుంటున్నాయి. ఇలాంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలంటే కొన్నింటికి ఫీచర్‌‌‌‌ ఫోన్లు వాడటమే బెస్ట్‌ అంటున్నారు నిపుణులు.

సెకెండరీ ఫోన్‌‌గా..
స్మార్ట్‌ ఫోన్‌‌తో చాలా ఉపయోగాలున్నాయి. అందువల్ల కచ్చితంగా వాడాల్సిందే. స్మార్ట్‌ ఫోన్లలో ఎన్ని సెక్యూరిటీ యాప్స్‌ వాడినా, డాటా హ్యాక్‌‌ అవ్వదని వంద శాతం చెప్పలేని పరిస్థితి. అయితే మీ మెసేజ్‌ చాట్‌‌లు, ఇతర డేటా భద్రంగా ఉండాలంటే సెకండరీ ఫోన్‌ వాడాలని సూచిస్తున్నారు ఎక్స్‌పర్ట్స్. వారి స్టడీ ప్రకారం సెకండరీ ఫోన్‌‌గా తక్కువ ధరలో దొరికే ఫీచర్‌‌‌‌ ఫోన్‌ అయితే మంచిది. స్మార్ట్‌ ఫోన్లలో వాట్సాప్‌, కెమెరా యాప్స్‌, కొన్ని థర్డ్‌ పార్టీ యాప్స్‌ ద్వారా డేటా చోరీ అవుతోంది. ఫోన్‌ లోని సమాచారం మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తుంది. అదే ఫీచర్‌‌‌‌ ఫోన్‌ అయితే థర్డ్‌ పార్టీ యాప్స్‌ సపోర్ట్‌ చేయవు. టెక్ట్స్ మెసేజ్‌‌లతోనే చాటింగ్‌ కాబట్టి, హ్యాకర్లు యాక్సెస్‌‌ చేయడం అంత ఈజీ కాదు. ఫీచర్‌‌‌‌ ఫోన్లను హ్యాక్‌‌ చేసేందుకు సరైన సర్ఫేస్‌‌ లేదు కాబట్టి, ఇది అంత త్వరగా హ్యాకర్లకు చిక్కదు. హ్యాకింగ్‌ ముప్పు ఉందని భావించే వాళ్లు ఈ ‘ఫీచర్‌‌‌‌ ఫోన్‌ ’ ఆప్షన్‌ ఎంచు కోవడమే మంచిది.

సంబంధిత వార్తల కోసం..

ఫోన్లు పేలుతున్నాయి.. ఛార్జింగ్ పెట్టేప్పుడు జాగ్రత్త