ఫెడెక్స్​ బాస్​గా సుబ్రమణియం

ఫెడెక్స్​ బాస్​గా సుబ్రమణియం

న్యూఢిల్లీ: మరో భారతీయుడు అమెరికా కంపెనీ బాస్​అయ్యారు. ఇండియన్​–అమెరికన్​ రాజ్​ సుబ్రమణియంను తమ సీఈఓగా నియమించుకున్నట్టు అమెరికా లాజిస్టిక్ కంపెనీ ఫెడెక్స్​ కార్పొరేషన్​ ప్రకటించింది. ప్రస్తుతం కంపెనీ ప్రెసిడెంట్​గా పనిచేస్తున్న ఈయన జూన్​ నుంచి కొత్త పోస్టులోకి వస్తారు. ఇప్పుడున్న చైర్మన్​, సీఈఓ ఫ్రెడరిక్​ స్మిత్ ఇక నుంచి​ ఎగ్జిక్యూటివ్​చైర్మన్​గా పనిచేస్తారు. కేరళలోని త్రివేండ్రానికి చెందిన రాజ్​ 1991లో ఫెడెక్స్​లో చేరారు. 2020 కంపెనీ బోర్డులో చోటు సంపాదించారు. వ్యాపార వ్యూహాలు రచించడం, వాటిని సమర్థంగా అమలు చేయడంలో ఆయనకు చాలా అనుభవం ఉందని కంపెనీ ప్రకటించింది. ప్రపంచంలోని అతిగొప్ప కంపెనీల్లో ఒకటైన ఫెడెక్స్​ సీఈఓగా అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నానని రాజ్​ అన్నారు. ఫెడెక్స్​1971లో ఏర్పాటయింది. ప్రపంచవ్యాప్తంగా లాజిస్టిక్స్​ సర్వీసులు అందించే ఈ  కంపెనీలో ఆరు లక్షల మంది పనిచేస్తున్నారు.