రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసేవరకు పోరాటాలు ఆపబోమని వివిధ సంఘాల లీడర్లు హెచ్చరించారు. గురువారం పలు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు. గన్‌పార్కు అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు నల్ల కండువాలతో పుస్తకాలు చదువుతూ ధర్నాలో పాల్గొన్నారు. ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మాసబ్ ట్యాంక్ లోని డీఎస్ఎస్ భవన్ వద్ద విద్యార్థులతో కలిసి ఆందోళన చేశారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కళ్లకు గంతలతో ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన తెలిపారు. సరూర్‌నగర్‌లో బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అనంతయ్య ఆధ్వర్యంలో స్టూడెంట్స్‌తో కలిసి ర్యాలీ నిర్వహించారు.
