ఫీజులు నియంత్రిస్తారా ?.. లేదా ?

ఫీజులు నియంత్రిస్తారా ?..  లేదా ?
  • స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముందు పేరెంట్స్ ధర్నా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల దోపిడీని అడ్డుకోవాలని డిమాండ్​ చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముందు సోమవారం పేరెంట్స్ ధర్నా చేశారు. అన్ని రాష్ట్రాలకంటే తెలంగాణలోనే ఫీజుల దోపిడీ ఎక్కువగా ఉందని, వెంటనే ఫీజుల కట్టడి చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్​ చేశారు. తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగటి నారాయణ, టీఎస్​టీసీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు కార్పొరేట్ విద్యా సంస్థలను కంట్రోల్​ చేస్తామని చెప్పిన నాయకులు, ఎనిమిదేండ్లుగా ఆ మాటే మరిచిపోయారని ఆరోపించారు.

కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు ఏటా 20–30% ఫీజులు పెంచుతూ పోతున్నాయని, వాటిని కంట్రోల్ చేయడం లేదని మండిపడ్డారు. విద్యాహక్కు చట్టం ప్రకారం కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల్లో 25% సీట్లు పేదలకు కేటాయించాలన్నారు. ఫీజుల భారం భరించలేక పేరెంట్స్ నగలను తాకట్టు పెడుతున్నారని, ఆస్తులను అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో ఫీజుల నియంత్రణ చట్టాలున్నాయని, తెలంగాణలో చట్టం చేయాలని డిమాండ్​ చేశారు. హయ్యర్ ఎడ్యుకేషన్​లో మాదిరిగానే మూడేండ్లకోసారి ఫీజులను నిర్ణయించాలని, ఏటా 10% ఫీజులు పెంచుకోవాలన్న తిరుపతిరావు కమిటీ సిఫార్సులను తిరస్కరించాలని సూచించారు. 

 

 

 

ఇవి కూడా చదవండి

ఎగ్జామ్స్‌‌ ముందు ఇట్ల తినాలె

జీతాలు రాక ప్రభుత్వ టీచర్ల అవస్థలు

పర్సనాలిటీ డిజార్డర్​తో పరేషాన్​