ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామిని ఆదివారం నల్గొండలో మాలమహానాడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండకు వచ్చిన ఆయనను మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి ఆధ్వర్యంలో పూలమాలలు, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు చింతపల్లి లింగమయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి చింతపల్లి బాలకృష్ణ, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు బోగరి అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బొప్పని నగేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

కాలుష్య కంపెనీ పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రద్దు చేయాలె

యాదాద్రి, వెలుగు : కాలుష్య కంపెనీల పర్మిషన్లను రద్దు చేయాలని యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. యాదాద్రి జిల్లా తుక్కాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న కంపెనీకి వ్యతిరేకంగా ప్రజలు నిర్వహిస్తున్న ఆందోళనకు ఆయన ఆదివారం మద్దతు ప్రకటించి మాట్లాడారు. గ్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీ కారణంగా తుక్కాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పుడు మరో కంపెనీకి పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రద్దు చేయకపోతే ఆందోళన తీవ్రం చేస్తాం అని హెచ్చరించారు. 

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే  ప్రజలకు మేలు

యాదాద్రి, వెలుగు : కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే అన్ని వర్గాలకు మేలు కలుగుతుందని టీపీసీసీ మెంబర్, ఆలేరు నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి బీర్ల అయిలయ్య అన్నారు. యాదాద్రి జిల్లా గుండాల మండలం వెల్మజాలలో ఆదివారం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ, టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుల, మతాలను రెచ్చగొడుతూ రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రజలు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు చూస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిన్రు

మునుగోడు, వెలుగు : రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పిన సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్పుల కుప్పగా మార్చారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఎన్నికల టైంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. నల్గొండ జిల్లా మునుగోడులో ఆదివారం జరిగిన బూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలనలో ప్రజలకు రూ. 5 లక్షల కోట్ల అప్పు మిగిలిందన్నారు. నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండ్లు, మూడు ఎకరాల భూ పంపిణీ, రైతులకు గిట్టుబాటు ధర, ఉదయ సముద్రం, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీసీ ప్రాజెక్టులను పూర్తి చేయని టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. మునుగోడులో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్వాయి స్రవంతిని గెలిపిస్తేనే రాష్ట్రంలో సంక్షేమం సాధ్యం అవుతుందన్నారు. దేశ ఆస్తులు, వ్యవస్థలు, సంస్థలను మోడీ ప్రభుత్వం ఆదానీ, అంబానీలకు కట్టబెడుతోందని ఆరోపించారు. సమావేశంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్ల నర్సిరెడ్డి, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.సత్యనారాయణరావు, రవళిరెడ్డి పాల్గొన్నారు.

భువనగిరిలో ట్రైనీ కలెక్టర్ల పర్యటన

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా భువనగిరిలో ఆదివారం ఆరుగురు ట్రైనీ కలెక్టర్లు పర్యటించారు. ఇందులో భాగంగా భువనగిరిలోని సఖి సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శ్వేతాపాండే, అషిమా గోయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శైర్యమాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అభిషేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అక్షిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆయుశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సువిజ్ఞా చంద్ర సందర్శించారు. సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎలాంటి వారు వస్తున్నారు, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, వారికి అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వృద్ధాశ్రమానికి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ టైంలో ట్రైనీ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్వేతా పాండే ఓ వృద్ధురాలి పక్కన కూర్చొని మాట్లాడుతూ భావోద్యోగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. వారి వెంట డీఆర్డీవో పీడీ ఉపేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, డీసీపీవో సైదులు, సీడీపీవోలు స్వరాజ్యం, శైలజ, లావణ్య, ప్రమీల ఉన్నారు.

నిర్వాసితులకు అండగా ఉంటా

యాదాద్రి, వెలుగు : బస్వాపురం రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని బీజేపీ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గూడూరు నారాయణరెడ్డి హామీ ఇచ్చారు. యాదాద్రి జిల్లా బీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తిమ్మాపురంలో ఆదివారం నిర్వహించిన మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. నిర్వాసితులందరికీ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్యాకేజీ కింద ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. పరిహారం కూడా సాధ్యమైనంత త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వల్దాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాళభైరవ, వల్లందాసు గండయ్య, ఉడుత వీరాస్వామి, పిన్నం నారాయణ, పాండు, నరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రైతు మృతి

హాలియా, వెలుగు : ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు వెళ్లిన ఓ రైతు కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చనిపోయాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రబెల్లిలో ఆదివారం జరిగింది. ఎస్సై శోభన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కొట్టె మల్లయ్య (45) ఆదివారం ఉదయం తన బత్తాయి తోటలో మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు వెళ్లాడు. మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాకపోవడంతో చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు పక్కనే ఉన్న ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో షాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టడంతో స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే చనిపోయాడు. 

చేపల వలలో చిక్కుకొని యువకుడు..

నేరేడుచర్ల (పాలకవీడు), వెలుగు : చేపలు పట్టేందుకు వేసిన వలలో చిక్కుకొని ఓ యువకుడు చనిపోయాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం రాఘవపురంలో శనివారం రాత్రి జరిగింది. మఠంపల్లి మండలం వరదాపురానికి చెందిన సాకె నరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (25) తన మేనమామ నరసింహతో కలిసి పాలకవీడు మండలం వేములూరు వాగులో చేపలు పట్టేందుకు శనివారం రాత్రి వెళ్లాడు. ఈ క్రమంలో చేపలు పట్టేందుకు వేసిన వలలో నరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చిక్కుకొని స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే చనిపోయాడు.

‘ప్రజాశాంతి’తోనే మునుగోడు అభివృద్ధి

మునుగోడు, వెలుగు : ప్రజాశాంతి పార్టీతోనే మునుగోడు అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. నల్గొండ జిల్లా మునుగోడులో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో సామాజిక న్యాయం జరగడం లేదన్నారు. మునుగోడు అభివృద్ధి జరగాలంటే కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గద్దె దించాలని చెప్పారు. ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే 60 ఏండ్లలో జరగని అభి-వృద్ధిని ఆరు నెలల్లోనే చేసి చూపిస్తానన్నారు. తనకు వస్తున్న ప్రజాదరణను ఓర్వలేకే తన సభకు పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వడం లేదని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓడిపోవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో గద్దర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమలులో నిర్లక్ష్యం

హాలియా/దేవరకొండ, వెలుగు : ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తెలంగాణలో అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విమర్శించారు. నల్గొండ జిల్లా హాలియాలోని వీబీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంకణాల నివేదితారెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ఇస్తోన్న సబ్సిడీ బియ్యాన్ని తానే ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలు బీజేపీ అమలు చేస్తోందన్నారు. అనంతరం కాలనీలో మొక్క నాటారు. హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 200 మందికి టెస్టులు చేసి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బండారు ప్రసాద్, నిమ్మల రాజశేఖర్, మండల అధ్యక్షుడు బైరబోయిన శంకర్, నంద్యాల ప్రవీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి హాలియాకు వస్తున్న క్రమంలో చింతపల్లి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 

అంధుల అభివృద్ధికి సహకరిస్తా

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : నల్గొండ పట్టణంలోని అంధుల స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆదివారం రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందర్శించారు. ఈ సందర్భంగా అంధుల అభివృ-ద్ధికి తన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. దాతల సహకారంతో స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నడపడం అభినందనీయం అన్నారు. ఆయన వెంట నాయకులు దాసోజు శ్రవణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డ్వాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రధాన కార్యదర్శి పొనుగోటి చొక్కారావు, రిటైర్డ్​ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజేంద్రకుమార్, కల్లోజు శ్రీనివాస్, సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, రాంరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఉన్నారు.

తాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన

సూర్యాపేట/హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : పండుగపూట తాగేందుకు కూడా నీళ్లు రావడం లేదంటూ సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) మండలం గట్టికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం మాచవరంలో ఆదివారం మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 20 రోజులుగా మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భగీరథ నీళ్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ బావుల వద్ద నీళ్లు తెచ్చుకుంటున్నామని చెప్పారు. ఆఫీసర్లు స్పందించి నీటి సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

తెలంగాణలో డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాయం

యాదగిరిగుట్ట, వెలుగు : తెలంగాణలో డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి రావడం ఖాయమని ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు బూడిద భిక్షమయ్యగౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధీమా వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం ప్యారారం, యావాపూర్, మునీరాబాద్, సోమాజీపల్లికి చెందిన పలువురు ఆదివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భిక్షమయ్యగౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలపై చర్చించకుండా ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశ రాజకీయాలంటూ నాటకాలు ఆడుతున్నారన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపును ఆపలేరన్నారు. కార్యక్రమంలో ప్యారారం సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చిమ్ముల రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, నాయకులు మోటి వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గుండ్ల గోపాల్, గుంటి నరసింహయాదవ్, బోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాజునాయక్, వట్టిపల్లి గోపాల్ పాల్గొన్నారు.

బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం

దేవరకొండ (కొండమల్లేపల్లి), వెలుగు : బీటీ రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి నుంచి పాల్వాయి వరకు రూ.3.55 కోట్లతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కొండమల్లేపల్లి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కొండమల్లేపల్లి నుంచి గౌరీకుంటతండా వరకు త్వరలో నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. అంతకు ముందు కొండమల్లేపల్లిలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శిరందాసు లక్ష్మమ్మ కృష్ణయ్య, ఎంపీపీ దూదిపాల రేఖారెడ్డి, జడ్పీటీసీ పసునూరి పార్వతమ్మ, సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ఫోరం అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మండల అధ్యక్షుడు దసృనాయక్, రైతుబంధు అధ్యక్షుడు కేసాని లింగారెడ్డి పాల్గొన్నారు.