గన్నేరువరం: లంచం ఇవ్వకుంటే ఎంపీడీవో తీగల శంకర్, ఏపీవో స్వాతి లు తనను ఉద్యోగం నుండి తీసివేశారని ఆరోపిస్తూ మహిళా అటెండర్ ఎడ్ల లక్ష్మి గన్నేరు వరం ఎంపీడీవో కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బాతో ఆందోళన చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎంపీడీవో ఆఫీస్ ఏర్పడినప్పటి నుండి తాను అటెండర్ గా డ్యూటీ చేస్తున్నానని, ఇప్పుడు జీతం పెరగడంతో అధికారులు రూ . 40 వేల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని, తాను నిరుపేదను ఇవ్వలేనని వేడుకున్నప్పటికీ ఉద్యోగానికి రావద్దని నెల రోజులుగా వేదనకు గురి చేస్తున్నారని ఆవేద న వ్యక్తం చేసింది.
ఉన్నత అధికారులు తక్షణం స్పందించి తన ఉద్యోగం ఇప్పించాలన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లక్ష్మీ దగ్గర నుండి పురుగు ల మందు డబ్బాను లాక్కొని ఆమెకు నచ్చ చెప్పారు.