తెలంగాణ సచివాలయం దగ్గర ప్రమాదం జరిగింది. సెక్రటేరియట్ సౌత్ ఈస్ట్ ఎంట్రెన్స్ దగ్గర ఓ మహిళా ఉద్యోగి కాలు ప్రమాదవశాత్తు గ్రిల్ లో ఇరికింది.ఆఫీసు నుంచి ఇంటికెళ్లే సమయంలో ఎంట్రెన్స్ దగ్గర అండర్ వెహికిల్ స్కానర్ గ్రిల్ లో మహిళా ఉద్యోగి కాలు ఇరుక్కుంది. దీంతో చాలా సేపు నరకయాతన అనుభవించింది.
అక్కడున్న వారు ఎంత ప్రయత్నించినా కాలు బయటకు రాలేదు. ఎస్ పీఎఫ్ సిబ్బంది స్కానర్ గ్రిల్ ను కట్ చేసి మహిళ కాలును బయటకు తీశారు. అప్పటి వరకు ఆ మహిళ అక్కడే కూర్చుండిపోయింది. మహిళా ఉద్యోగికి ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
