BAN vs IRE: దిగ్గజాల లిస్ట్‌లో ముష్ఫికర్.. 100వ టెస్టులో సెంచరీ దిశగా బంగ్లా వెటరన్ ప్లేయర్

BAN vs IRE: దిగ్గజాల లిస్ట్‌లో ముష్ఫికర్.. 100వ టెస్టులో సెంచరీ దిశగా బంగ్లా వెటరన్ ప్లేయర్

బంగ్లాదేశ్ సీనియర్ ప్లేయర్ ముష్ఫికర్ రహీమ్ అరుదైన లిస్ట్ లో స్థానం సంపాదించాడు. 100 టెస్టులాడిన తొలి బంగ్లాదేశ్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. బుధవారం (నవంబర్ 19) ఐర్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో రహీం తన 100 టెస్టులను పూర్తి చేసుకున్నాడు. 100 టెస్ట్ మ్యాచ్ సందర్భంగా రహీం ఎమోషనల్ అయ్యాడు. 2005లో తన తొలి టెస్ట్ క్యాప్‌ను అందజేసిన బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ హబీబుల్ బషర్ సుమోన్ తన 100వ టెస్టుకు కూడా క్యాప్‌ను అందజేయడం విశేషం. 20 ఏళ్ళ తన కెరీర్ ను ఈ మాజీ కెప్టెన్ విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. 

100టెస్ట్ ఆడుతున్న రహీం బ్యాటింగ్ లో అదరగొడుతున్నాడు. రెండో టెస్ట్ తొలి రోజు ఆటలో భాగంగా సెంచరీ దిశగా దూసుకెళ్తున్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 99 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. రెండో రోజు ఒక పరుగు కొడితే 100వ టెస్టులో సెంచరీ చేసిన 12 వ ప్లేయర్ గా అరుదైన లిస్ట్ లో స్థానం సంపాదిస్తాడు. ఇప్పటివరకు రహీం 100 టెస్ట్ మ్యాచ్ లాడితే 183 ఇన్నింగ్స్ ల్లో 6450 పరుగులు చేశాడు. వీటిలో 12 సెంచరీలు.. 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మూడు డబుల్ సెంచరీలు కూడా ఇందులో ఉన్నాయి. బంగ్లాదేశ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా రహీం కొనసాగుతున్నాడు.  

ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 4 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీం లిట్టన్ దాస్ ఉన్నారు. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. షాద్మాన్ ఇస్లాం (35), మహ్మదుల్ హసన్ జాయ్ (34) తొలి వికెట్ కు 52 పరుగులు జోడించి పర్వాలేదనిపించారు. ఆ తర్వాత 95 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కొంచెం కష్టాల్లో పడినట్టుగా అనిపించింది. ఈ దశలో రహీం (99*) రెండు కీలక బాగస్వామ్యాలను నిర్మించి జట్టును ఆదుకున్నాడు. మోమినుల్ హక్ (63)తో కలిసి 107 పరుగులు.. ఆ లిటన్ దాస్ (47*)తో కలిసి అజేయంగా 90 పరుగులు జోడించాడు. తొలి రోజు బంగ్లా కోల్పోయిన నాలుగు వికెట్లు స్పిన్నర్ ఆండీ మెక్‌బ్రైన్ పడగొట్టాడు.