2030 నాటికి బీటెక్ కంప్లీట్ చేసి జాబ్స్ కోసం ట్రై చేసుకునే వాళ్లకు గుడ్ న్యూస్..

2030 నాటికి బీటెక్ కంప్లీట్ చేసి జాబ్స్ కోసం ట్రై చేసుకునే వాళ్లకు గుడ్ న్యూస్..
  • జీసీసీలతో 2030 నాటికి 13 లక్షల జాబ్స్
  • 34.6 లక్షలకు చేరనున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య
  • 2026 నాటికి 24 లక్షలకు చేరే చాన్స్​
  • ఎన్​ఎల్​బీ సర్వీసెస్​ రిపోర్ట్ వెల్లడి

న్యూఢిల్లీ: మనదేశంలో గ్లోబల్​ కేపబిలిటీ సెంటర్స్​ (జీసీసీలు) ద్వారా రాబోయే ఐదేళ్లలో కొత్తగా 13 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. జీసీసీల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో వీటిలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య 2026 నాటికి 24 లక్షలకు, 2030 నాటికి 34.6 లక్షలకు చేరుకుంటుందని ఒక రిపోర్ట్​ వెల్లడించింది. గ్లోబల్​ టెక్నాలజీ డిజిటల్​ టాలెంట్​ సొల్యూషన్స్​ ప్రొవైడర్​ ఎన్​ఎల్​బీ సర్వీసెస్​ రిపోర్ట్​ ఈ విషయాలను వెల్లడించింది. ఉద్యోగుల సంఖ్య 2026 నాటికి 24 లక్షలకు చేరుతుంది. 

రాబోయే ఐదేళ్లలో జీసీసీ ఉద్యోగుల సంఖ్య 30 శాతం పెరుగుతుంది. ఏఐ టెక్నాలజీలకు డిమాండ్​ పెరుగుతుండటంతో సైబర్​ సెక్యూరిటీ ఏఐ గవర్నెన్స్​ ఆర్కిటెక్ట్స్​ (29 శాతం), ప్రాంప్ట్​ ఇంజనీర్స్​ (26 శాతం), జెన్​ ఏఐ ప్రొడక్ట్​ ఓనర్స్​ (22 శాతం), ఏఐ పాలసీ రిస్క్​ స్ట్రాటజిస్ట్స్​ (21 శాతం) వంటి కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. ఎల్​1 ఐటీ సపోర్ట్​ (75 శాతం), లెగసీ అప్లికేషన్​ డెవలప్​మెంట్​ (74 శాతం), మాన్యువల్​ క్యూఏ (72 శాతం), ఆన్​-ప్రెమ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ మేనేజ్​మెంట్​ (67 శాతం) వంటి జాబ్స్​ను తొలగిస్తున్నారు. జీసీసీలు ఏఐ-నేటివ్​, ప్రొడక్ట్​- ఓరియెంటెడ్​ టీమ్​ల వైపు మళ్లుతుండటమే ఇందుకు కారణం. 

చిన్న నగరాలకూ విస్తరణ

ఏఐ టెక్నాలజీల వాడకం పెరుగుతుండటంతో టైర్​ 2, టైర్​ 3 నగరాలకూ జీసీసీలు వస్తున్నాయి. 10–-12 శాతం తక్కువ అట్రిషన్ (రాజీనామా)​ రేట్లు, 30–-50 శాతం తక్కువ ఆఫీస్​ ఖర్చులు, 20–-35 శాతం తక్కువ టాలెంట్​ఖర్చు వంటి ప్రయోజనాలను ఉపయోగించుకోవడానికి జీసీసీలు మెట్రో నగరాల నుంచి చిన్న నగరాలకు మారుతున్నాయి. 

"2030 నాటికి, జీసీసీ ఉద్యోగులలో దాదాపు 39 శాతం టైర్​ 2 టైర్​ 3 నగరాల నుంచి పనిచేస్తారు.   టైర్– 1 నగరాలు లీడర్షిప్​, అడ్మినిస్ట్రేషన్​, ఆర్​ అండ్​ డీ కేంద్రాలుగా పనిచేయడం కొనసాగిస్తాయి.  కోయంబత్తూర్​,అహ్మదాబాద్​, భువనేశ్వర్​ వంటివి  డెలివరీ కేంద్రాలుగా మారుతున్నాయి’’ అని ఎన్​ఎల్​బీ  సీనియర్​ ఎగ్జిక్యూటివ్​​ వరుణ్​ సచ్​దేవ వివరించారు.