Bhagyashree Borse : లవ్ మ్యారేజ్‌పై భాగ్యశ్రీ బోర్సే బోల్డ్ స్టేట్‌మెంట్.. రామ్ హీరోయిన్ మనసులో ఏముందంటే?

Bhagyashree Borse : లవ్ మ్యారేజ్‌పై భాగ్యశ్రీ బోర్సే బోల్డ్ స్టేట్‌మెంట్..  రామ్ హీరోయిన్ మనసులో ఏముందంటే?

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని సరసన ' ఆంధ్రా కింగ్  తాలూకా ' చిత్రంలో నటిస్తున్న యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది . ఈ ముద్దుగుమ్మ తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన పెళ్లి గురించి చాలా క్లారిటీగా.. బోల్డ్ గా సమాధానం చెప్పి అందరి దృష్టిని ఆకర్షిస్తోందీ భామ.

లవ్ మ్యారేజే చేసుకుంటా..

ఈ ఇంటర్యూలో మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా లేదంటే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారా? అని  యాంకర్ అడిగిన ప్రశ్నకు భాగ్యశ్రీ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. ఈ ప్రశ్నకు ఏమాత్రం తడుముకోకుండా... "కన్ఫర్మ్‌గా లవ్ మ్యారేజే చేసుకుంటా" అని బదులిచ్చింది. అయితే.. మీరు ఇప్పుడు ప్రేమలో ఉన్నారా? అని ప్రశ్నించగా, వెంటనే లేను అని చెప్పింది. ప్రేమలో లేకుండానే లవ్ మ్యారేజ్ చేసుకుంటానని ఎలా చెబుతున్నారని అడగగా, "నాకు ప్రేమ మీద విపరీతమైన విశ్వాసం ఉంది. ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకుని, నచ్చే వ్యక్తి నా జీవితంలోకి వస్తాడనే నమ్మకం ఉంది. అందుకే ప్రేమ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను అని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పుకొచ్చింది.

ప్రేమ విషయాన్ని దాస్తున్నారేమో?

భాగ్యశ్రీ ఇచ్చిన ఈ సమాధానం సినీ వర్గాల్లో, అభిమానులలో కొత్త చర్చకు తెర తీసింది. తాను ప్రేమలో లేనని చెబుతున్నా కూడా, లవ్ మ్యారేజ్ పై ఆమెకున్న అంతటి దృఢమైన నమ్మకం చూస్తుంటే... కెరీర్ కోసం ప్రేమ విషయాన్ని దాస్తున్నారేమో అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒక అమ్మాయి అప్పటికే ప్రేమలో ఉంటే తప్ప, పెళ్లి గురించి అంత కచ్చితంగా ప్రేమ వివాహమే అని చెప్పదు అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాలంలో హీరోయిన్లు తమ వ్యక్తిగత విషయాలను దాచడానికి ప్రయత్నించడం సర్వసాధారణమే అయిపోయింది. బహుశా భాగ్యశ్రీ కూడా తన రిలేషన్ షిప్ ను సీక్రెట్‌గా ఉంచాలని భావిస్తున్నారేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు..

రామ్ పోతినేని సరసన..

తాను ప్రేమ వివాహం చేసుకునేది కన్ఫర్మ్ అని చెప్పిన భాగ్యశ్రీ, అది ఎప్పుడు, ఏంటి అనే దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ రామ్ పోతినేనితో నటించిన 'ఆంధ్రా కింగ్ తాలూకా' సినిమాపైనే ఉన్నాయి. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. వరుసగా రెండు ఫ్లాప్‌ల తర్వాత వస్తున్న ఈ సినిమా ఆమె కెరీర్‌కు కీలకం కానుంది. సినిమా విడుదల కాకముందే, తన వ్యక్తిగత జీవితంపై భాగ్యశ్రీ చేసిన ఈ బోల్డ్ స్టేట్‌మెంట్ ఆమెకు మరింత హైప్‌ను తెచ్చిపెట్టింది. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు కారణం ఏంటో, భాగ్యశ్రీ బోర్సే ప్రేమ విషయం ఎప్పుడు బయటపెడుతుందో చూడాలి మరి.