మీ ఊపిరితిత్తుల్లో సమస్య ఉందా..? కేవలం ఒక్క నిమిషంలోనే ఇలా తెలుసుకోండి..!

మీ ఊపిరితిత్తుల్లో సమస్య ఉందా..? కేవలం ఒక్క నిమిషంలోనే ఇలా తెలుసుకోండి..!

దేశంలోని పలు రాష్ట్రాల్లో గాలి నాణ్యత రోజురోజుకు మరింత దిగజారుతోంది. కలుషితమైన గాలి అనేక వ్యాధులకు దారితీస్తోంది. ఇది ఊపిరితిత్తులకు కూడా హాని కలిగిస్తుంది. ఊపిరితిత్తులు శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. శ్వాసతో పాటు, శరీరం నుంచి కలుషితమైన, హానికరమైన పొగను బయటకు పంపడం ఊపిరితిత్తుల పని. ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులు ఉబ్బసం, న్యూమోనియా వంటి అనేక రకాల వ్యాధుల నుంచి మనల్ని రక్షించడంలో సహాయపడతాయి. అయితే.. కరోనా మహమ్మారి, పెరుగుతున్న కాలుష్యం కారణంగా, ఊపిరితిత్తులు బలహీనంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో మీ ఊపిరితిత్తుల్లో ఏమైనా సమస్య ఉందా అని ముందే తెలుసుకోండి. 

ఇందుకు హాస్పిటల్‎కు వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్క నిమిషంలోనే మీ లంగ్స్ హెల్త్ కండిషన్ గురించి తెలుసుకోవచ్చు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ప్రతిరోజు 60 సెకన్ల (నిమిషం) పాటు మీ శ్వాసను తనిఖీ చేసుకోవడమే. ఇలా చేయడం వల్ల మీ ఊపిరితిత్తుల్లో సమస్యను ప్రారంభంలోనే గుర్తించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే.. ఇది రోగనిర్ధారణ పరీక్ష కాదు. కానీ ఇలా చేయడం ద్వారా ఊపిరితిత్తుల్లో సమస్యను ముందుగానే గుర్తించి జాగ్రత్త పడొచ్చు. చాలా మంది పల్మోనాలజిస్టులు కూడా తరచుగా ఈ విధానాన్ని సూచిస్తారు. 

60 సెకన్ల శ్వాస పరీక్ష ఎలా చేయాలంటే..?

ఫస్ట్ నెమ్మదిగా గాలి పీల్చుకోండి. తర్వాత 60 సెకన్ల పాటు మీ శ్వాసను బిగించి.. తర్వాత నెమ్మదిగా గాలిని వదలండి. ఈ ప్రతిస్పందనలు మీ ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయనే సంకేతాలను సూచిస్తాయి. మీరు నెమ్మదిగా, స్థిరంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే మీ వాయుమార్గాలు సున్నితంగా ఉన్నాయని, మీకు ఆస్తమా అభివృద్ధి చెందుతున్నట్లు లేదా మీ శ్వాస కండరాలు బలహీనంగా ఉన్నాయని అర్థం. పరీక్ష సమయంలో మీరు దగ్గుతూనే ఉంటే మీ వాయుమార్గాలు వాపుకు గురవుతున్నాయని అర్థం.

మీకు గాలిని పూర్తిగా బయటకు పంపడంలో ఇబ్బంది ఉంటే అది ఊపిరితిత్తుల అవరోధం ముందస్తు సంకేతం కావచ్చు. ఇది ధూమపానం చేసేవారిలో లేదా మురికి గాలికి గురైన వ్యక్తులలో సంభవించవచ్చు. ఈ పరీక్ష సమయంలో మీకు తరచుగా అసౌకర్యం అనిపించడం లేదా మీ శ్వాస సాధారణం కంటే వేగంగా జరిగితే మీరు ఊపిరితిత్తులలో నిపుణుడైన వైద్యుడిని సంప్రదించాలి. సమస్యను ముందుగానే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో మీ ఊపిరితిత్తులను రక్షించుకోవడానికి ఒక సులభమైన మార్గం కావచ్చు.