హైదరాబాద్, వెలుగు: కిటికీలు, డోర్లను తయారు చేసే ఫెనెస్టా జడ్చర్లలో తన తొలి షోరూమ్‌ను ప్రారంభించింది. తెలంగాణలో కంపెనీకి ఇది 12వ షోరూమ్. ఈ షోరూమ్‌ను క్రియేటివ్ నెస్ట్ నిర్వహిస్తుండగా, ఇక్కడ స్థానిక వినియోగదారులకు అవసరమయ్యే యూపీవీసీ, అల్యూమినియం కిటికీలు, తలుపులు, ప్యానెల్ డోర్లు వంటివి అందుబాటులో ఉంటాయని ఫెనెస్టా పేర్కొంది.
ఈ కంపెనీ బిజినెస్ హెడ్ సాకేత్ జైన్ మాట్లాడుతూ, పట్టణీకరణ, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రీమియం బిల్డింగ్ సొల్యూషన్లకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో తెలంగాణ తమకు కీలక మార్కెట్‌గా ఎదిగిందని అన్నారు. జడ్చెర్ల షోరూమ్‌తో రాష్ట్రంలో మరింతగా విస్తరించడానికి వీలుంటుందని తెలిపారు.
