- డివైడర్‌ను ఢీకొట్టి.. రెండు కార్లపైకి దూసుకెళ్లిన వైనం
- ముగ్గురికి గాయాలు
జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఆదివారం మధ్యాహ్నం ఓ ఫెరారీ కారు బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్‌తో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం అవతలి వైపు నుంచి వస్తున్న మరో రెండు కార్లను బలంగా ఢీకొట్టింది. ఏపీకి చెందిన వ్యాపారవేత్త, ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి బంధువు అయిన క్రాంతి రెడ్డి తన ఫెరారీ కారులో ఫిలింనగర్ నుంచి కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
కారు వీల్ జామ్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. వాహనాలను స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
