పరీక్ష తేదీలు ప్రకటించిన టీఎస్పీఎస్సీ.. ఆ పరీక్షల తేదీల్లో మార్పు

పరీక్ష తేదీలు ప్రకటించిన టీఎస్పీఎస్సీ.. ఆ పరీక్షల తేదీల్లో మార్పు

టీఎస్పీఎస్సీ రీ షెడ్యూల్ చేసిన పలు పరీక్ష తేదీలను ప్రకటించింది. ఈ నెల 23 న జరిగే అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ పరీక్ష ను జూన్ 28 వ తేదీకి మార్చింది. ఈ  నెల 25 వ తేదీన జరిగే  అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్షను మే 16కు, 26,27 తేదీల్లో జరగాల్సిన భూగర్భ జలశాఖలో గెజిటెడ్ పోస్టుల నియామక పరీక్షను.. జూలై 18, 19 తేదీలకు మార్చుతున్నట్లు ప్రకటనలో పేర్కొంది. 

మే 7న జరుగాల్సిన  డ్రగ్స్ ఇన్స్పెక్టర్ నియామక పరీక్షను కూడా మే19వ తేదీకి మార్చింది. మే 15,16 న జరుగాల్సిన భూగర్భ జలశాఖలో నాన్ గెజిటెడ్ పోస్టుల నియామక పరీక్షను జూలై 20, 21 తేదీలకు మార్చుతున్నట్లు టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది.  గ్రూప్ 1 ప్రిలిమ్స్ సహా పలు పరీక్ష ప్రశ్నా పత్రాలు లీక్ అయిన నేపథ్యంలో టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా పరిగణించబడుతున్న ప్రవీణ్, రాజశేఖర్ లను ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది.