సైప్రస్: ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో ఇండియా గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద మరో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన ఐదో రౌండ్‌లో రష్యా జీఎం ఆండ్రీ ఎసిపెంకోతో తెల్లపావులతో తలపడ్డ ప్రజ్ఞా 31 ఎత్తుల్లోనే డ్రాకు అంగీకరించాడు. ప్రజ్ఞానంద ప్రస్తుతం 2.5 పాయింట్లతో మూడో ప్లేస్‌లో ఉన్నాడు.
మరోవైపు ఉజ్బెకిస్తాన్ యువ సంచలనం జావోఖిర్ సిందరోవ్ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ వరల్డ్ నంబర్ 2 హికారు నకమురను ఓడించాడు. ఫలితంగా 4.5 పాయింట్లతో టాప్ ప్లేస్‌లోకి వచ్చాడు. ఇక, విమెన్స్ సెక్షన్ ఐదో రౌండ్‌లో ఇండియా జీఎం దివ్యా దేశ్‌ముఖ్ చైనాకు చెందిన టాన్ జోంగీతో 45 ఎత్తుల తర్వాత డ్రా చేసుకుంది. ఆర్. వైశాలి 62 ఎత్తుల పోరాటం తర్వాత జు జినెర్ (చైనా) చేతిలో పరాజయం పాలైంది.
