ఫిడే స్విస్‌‌‌‌ టోర్నీలో అర్జున్‌‌‌‌ తొలి గేమ్‌‌‌‌ డ్రా

ఫిడే స్విస్‌‌‌‌ టోర్నీలో  అర్జున్‌‌‌‌ తొలి గేమ్‌‌‌‌ డ్రా

సమర్కండ్‌‌‌‌ (ఉజ్బెకిస్తాన్‌‌‌‌): తెలంగాణ గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ అర్జున్‌‌‌‌ ఎరిగైసి.. ఫిడే స్విస్‌‌‌‌ టోర్నీని డ్రాతో మొదలుపెట్టాడు. ఓపెన్‌‌‌‌ సెక్షన్‌‌‌‌లో గురువారం చిగేవ్‌‌‌‌ మక్సిమ్‌‌‌‌ (రష్యా)తో జరిగిన తొలి రౌండ్‌‌‌‌ గేమ్‌‌‌‌ను 54 ఎత్తుల వద్ద డ్రాగా ముగించాడు. ప్రజ్ఞానంద.. జియాంగ్‌‌‌‌ జెఫ్రీ (అమెరికా) మధ్య జరిగిన గేమ్‌‌‌‌ డ్రా అయ్యింది. 

మరో గేమ్‌‌‌‌లో వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ డి. గుకేశ్ 45 ఎత్తుల వద్ద ఎటియన్నే బాక్రోట్ (ఫ్రాన్స్‌‌‌‌)పై, విదిత్‌‌‌‌ సంతోష్‌‌‌‌ గుజరాతీ 37 ఎత్తుల వద్ద అలెగ్జాండర్‌‌‌‌ (రష్యా)పై గెలవగా, పెంటేల హరికృష్ణ.. అంటోన్‌‌‌‌ డొమిచెక్‌‌‌‌ (రష్యా) చేతిలో ఓడాడు. విమెన్స్‌‌‌‌ సెక్షన్‌‌‌‌లో ద్రోణవల్లి హారిక.. బాలబయేవా జెనియా (కజకిస్తాన్‌‌‌‌) గేమ్‌‌‌‌ డ్రా కాగా, ఆర్‌‌‌‌. వైశాలి.. గుల్రుఖ్‌‌‌‌బేగిమ్ (ఉజ్బెకిస్తాన్‌‌‌‌)పై గెలిచింది.