ఫీల్డ్ అసిస్టెంట్లను డ్యూటీలో జాయిన్‌‌‌‌ చేసుకుంటున్నరు

ఫీల్డ్ అసిస్టెంట్లను డ్యూటీలో జాయిన్‌‌‌‌ చేసుకుంటున్నరు

హైదరాబాద్, వెలుగు: సమ్మె చేశారనే కారణంతో విధుల్లోకి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం హోల్డ్‌‌‌‌లో పెట్టిన ఫీల్డ్ అసిస్టెంట్లను సోమవారం డ్యూటీలో జాయిన్‌‌‌‌ చేసుకోనున్నారు. ఈ విషయమై సీఎం కేసీఆర్ శనివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఈ నెల 8న వారంతా డ్యూటీలో చేరొచ్చని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించారు. దీంతో ఫీల్డ్‌‌‌‌ అసిస్టెంట్ల రీజాయినింగ్స్ ఖాయమేనని తెలుస్తోంది.

అయితే, వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డీఆర్డీఏలను ఆదేశిస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నుంచి ఆదివారం రాత్రి వరకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. సోమవారం ఉదయం సర్క్యులర్ విడుదల చేయడంతో పాటు వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్లను డ్యూటీలోకి తీసుకోనున్నట్లు తెలిసింది.