ఉద్యోగం కోసం పల్లా రాజేశ్వర్ రెడ్డి కాళ్లమీద పడ్డ మహిళ

V6 Velugu Posted on Feb 04, 2021

ఖమ్మం జిల్లా : ఫిల్డ్ అసిస్టెంట్ లను తిరిగి వీధుల్లోకి తీసుకోవాలని రైతుబంధు సమితి రాష్ట్ర కన్వీనర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందు కొంగు చాపి, కాళ్ళు మొక్కుతూ ఉద్యోగాన్ని అడుక్కుంది మహిళా ఫీల్డ్ అసిస్టెంట్. ఈ సంఘటన గురువారం ఖమ్మంజిల్లాలో జరిగింది. వ‌రంగ‌ల్-న‌ల్గొండ‌-ఖ‌మ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా రెండోసారి బ‌రిలో ఉన్న ప‌ల్లాను ఖ‌మ్మం జిల్లాకు చెందిన ఓ మహిళా ఫీల్డ్ అసిస్టెంట్ కొంగుచాపి, కాళ్ల‌పై ప‌డి ప్రాదేయ‌ప‌డింది.

ఈ సందర్భంగా మాట్లాడిన మహిళా ఫీల్డ్ అసిస్టెంట్.. మా పొట్టలను కొట్టొద్దు సారూ మీ పాదాలు పట్టుకుంటానని తెలిపింది. తెలంగాణ వస్తే కొలువులు వస్తాయని అనుకున్నామని.. కానీ ఉన్న కొలువులు పోతాయని ఉహించలేదని చెప్పింది. మాకు పర్మినెంట్ ఉద్యోగం లేక పోయినా పర్వాలేదన్న ఆమె.. ఉన్న కొలువులను పునరుద్ధరణ చేయాలని వేడుకుంది. తెలంగాణ ఉద్యమంలో పోరాడామని..కేసీఆర్ బిడ్డకు కొలువు పోతే.. ఏడాది గడవక ముందే కొలువును ఇచ్చారని చెప్పంది.

కేసీఆర్ బిడ్డ లాగానే మేము అనుకోని మా ఉన్న కొలువులు మాకివ్వలని ప్రాధేయపడింది. కొంగు పట్టి అడుగుతున్న మీ బిడ్డ లాంటిదాన్ని సారు అని పల్లా రాజేశ్వర్ రెడ్డిని  కోరిన ఆమె..ఫిల్డ్ అసిస్టెంట్ లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వేడుకుంది. చివరకు పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందు కొంగు చాపి, కాళ్ళు మొక్కుతూ ఉద్యోగాన్ని అడుక్కోవడంతో అక్కడ పరిస్థితి కాసేపు ఉద్రిక్తంగా మారింది.

Tagged jobs, Palla Rajeshwar Reddy, Field assistant, request

Latest Videos

Subscribe Now

More News