FIFA World Cup : ఫిక్సింగ్ ఆరోపణలతో స్టార్ ప్లేయర్ అరెస్ట్..! ఎవరీ ఎలీ వాహి..?

FIFA World Cup : ఫిక్సింగ్ ఆరోపణలతో స్టార్ ప్లేయర్ అరెస్ట్..! ఎవరీ ఎలీ వాహి..?

ఫిఫా వరల్డ్ కప్ సంరంభం ఇప్పుడే మొదలైంది. అసలు పండుగ ముందుంది. కానీ అప్పుడే ఫిక్సింగ్ ఆరోపణలతో ఒక స్టార్ ప్లేయర్ అరెస్ట్ కావడం ఆందోళన కలిగించే అంశం. ఐవరీ కోస్ట్ స్టార్ ప్లేయర్ ఎలీ వాహి అరెస్ట్ ఆ దేశానికి షాక్ అనే చెప్పాలి.

 టోర్నమెంట్‌కు రెండు వారాల ముందు జరిగిన ఒక మ్యాచ్ కు సంబంధించి ఫిక్సింగ్‌  ఆరోపణలపై అరెస్టయ్యాడు వాహి. ది అథ్లెటిక్.. రిపోర్ట్ ప్రకారం..  OGC నైస్ తరఫున ఆడుతున్నప్పుడు FC మెట్జ్‌తో జరిగిన లీగ్ 1 మ్యాచ్‌లో.. కావాలనే ఎల్లో కార్డు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. 

మార్సెయిల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పోక్స్పర్సన్ ది అథ్లెటిక్ తో మాట్లాడుతూ.. ఫ్రాన్స్ లీగ్ 1లో పోటీపడుతున్న 23 ఏళ్ల వాహి.. ఆర్గనైజ్డ్ ఫ్రాడ్ (వ్యవస్థీకృత మోసం), ఆర్గనైజ్డ్ స్పోర్ట్స్ కరప్షన్ ( వ్యవస్థీకృత క్రీడా అవినీతి), క్రైమ్, మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు. ఈ ఆరోపణలపై మార్సెయిల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫీస్  దర్యాప్తులో భాగంగా మే 29న అరెస్టు చేసినట్లు చెప్పారు. పోలీసు కస్టడీలో విచారించిన తర్వాత వాహిని  విడుదల చేశారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఈ సందర్భంగా తెలిపారు. కాదు.''

  • ఎలీ వాహి ఎవరు?

 జనవరి 2, 2003న ఫ్రాన్స్‌లోని కోర్కోరోన్స్‌లో జన్మించిన ఎలీ వాహి ఐవరీ కోస్ట్ సంతతికి చెందినవాడు. కేవలం రెండేళ్ల వయసుతో తండ్రిని కోల్పోవడంతో తన తల్లి, సోదరి, స్టెప్ ఫాదర్ (సవతి తండ్రి) రిచ్‌మండ్‌తో కలిసి పెరిగాడు.   2019లో, ఫ్రాన్స్ U17 తరపున.. ఇటలీ U17 జట్టుతో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు . 2021లో ఫ్రాన్స్ U19 తరపున కూడా ఆడాడు.

మార్చి 2026లో, ఫ్రాన్స్ నుంచి ఐవరీ కోస్ట్‌కు తన ప్రాతినిధ్యాన్ని మార్చుకోవాలన్న ఎలీ వాహి అభ్యర్థనను FIFA ఆమోదించింది. దీంతో సీనియర్ స్థాయిలో ఎలిఫెంట్స్ కు ప్రాతినిధ్యం వహించడానికి అర్హత పొందాడు. కానీ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టు కావడం ఆ జట్టుకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.