Fifa World Cup: స్విట్జర్లాండ్‌‌ టాప్‌‌ షో.. ఓటమి ఎరుగని బోస్నియాకు చెక్

Fifa World Cup: స్విట్జర్లాండ్‌‌ టాప్‌‌ షో.. ఓటమి ఎరుగని బోస్నియాకు చెక్

ఇంగిల్‌‌వుడ్: వరల్డ్‌‌ కప్‌‌లో స్విట్జర్లాండ్‌‌ టాప్‌‌ షో చూపెట్టింది. శుక్రవారం జరిగిన గ్రూప్‌‌–బి మ్యాచ్‌‌లో 4–1తో బోస్నియా హెర్జెగోవినాపై గెలిచింది. దాంతో వరుసగా 9 మ్యాచ్‌‌ల్లో ఓటమి ఎరుగని బోస్నియాకు ఎట్టకేలకు చెక్‌‌ పడింది. జోహన్‌‌ మంజాంబి (74, 90వ ని), రూబెన్‌‌ వర్గాస్‌‌ (84వ ని), గ్రానిట్‌‌ హకా (90+7వ ని) స్విస్‌‌కు గోల్స్‌‌ అందించారు.

ఎర్మిన్‌‌ మహ్మిక్‌‌ (90+3వ ని) బోస్నియా తరఫున ఏకైక గోల్‌‌ చేశాడు. సబ్‌‌స్టిట్యూట్‌‌గా వచ్చిన 20 ఏళ్ల జోహన్‌‌ స్విస్ వ్యాలీ షాట్‌‌లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. తారిక్‌‌ ముహారెమోవిచ్‌‌ రెడ్‌‌ కార్డ్‌‌కు గురి కావడం కూడా బోస్నియాకు ఎదురుదెబ్బగా మారింది. దీన్ని అవకాశంగా తీసుకున్న స్విస్‌‌ ప్లేయర్లు మ్యాచ్‌‌ ఆఖరి నిమిషాల్లో గోల్స్‌‌ వర్షం కురిపించారు.

40 ఏళ్లు పైబడిన వయసులో ప్రపంచకప్ మ్యాచ్ ఆడిన నాలుగో అవుట్‌‌ఫీల్డ్ ఆటగాడిగా బోస్నియా కెప్టెన్‌‌ ఎడిన్‌‌ డిజెకో రికార్డు సృష్టించాడు. లూకా మోడ్రిచ్, క్రిస్టియానో రొనాల్డో ఈ జాబితాలో ఉన్నారు.