అమెరికాలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

అమెరికాలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు
  • ఎఫ్‌‌ఐఏ ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్‌‌, వెలుగు: అమెరికాలో భారత 75వ స్వాతంత్ర్య వేడుకలను ది ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియన్‌‌ అసిసోయేషన్‌‌ (ఎఫ్‌‌ఐఏ) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం న్యూయార్క్​  టైమ్‌‌ స్క్వేర్‌‌‌‌ వద్ద నిర్వహించిన జెండా కార్యక్రమానికి భారీ సంఖ్యలో ఇండియన్స్‌‌ తరలివచ్చారు. ఇండియన్‌‌ కాన్సుల్‌‌ జనరల్‌‌ రణధీర్‌‌‌‌ జైస్వాల్‌‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. 25 ఫీట్ల పొడవైన పోల్‌‌కు 6×10 ఫీట్ల సైజు ఉన్న జెండాను అమర్చారు. టైమ్‌‌ స్క్వేర్‌‌ చరిత్రలో ఇదే అతిపెద్ద జెండా అని ఎఫ్‌‌ఐఏ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా యంగెస్ట్‌‌ గ్రాండ్‌‌ మాస్టర్ అభిమన్యు మిశ్రాను జైస్వాల్‌‌ సన్మానించారు. బ్రూక్లిన్‌‌ బోరో ప్రెసిడెంట్‌‌ ఎరిక్‌‌ ఆడమ్స్‌‌ ఆఫీసు నుంచి జైస్వాల్‌‌ ప్రశంసలు అందుకున్నారు. ఎఫ్‌‌ఐఏ చైర్మన్‌‌ అంకూర్‌‌ ఇండియన్స్‌‌కు విషెస్‌‌ చెప్పారు. ఎఫ్‌‌ఐఏ ప్రెసిడెంట్‌‌ అనిల్‌‌ బన్సాల్‌‌ మాట్లాడుతూ.. అమెరికన్లు మన చరిత్ర, సంస్కృతి, మన మాతృభూమి పట్ల ప్రేమతో ఉంటారన్నారు. న్యూయార్క్‌‌ డిప్యూటీ సీజీఐ శత్రుజ్ఞ సింహ, కెప్టెన్‌‌ అమన్‌‌దీప్‌‌ సింగ్‌‌ సంధు, ఆనంద్‌‌ పటేల్‌‌ తదితరులు పాల్గొన్నారు.