బియ్యం ఎగుమతులపై తెలంగాణ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం సాగింది. ఫిలిప్ఫైన్ తో కు బియ్యం ఎగుమతుల్లో భారీ కుంభకోణం జరిగిందని హరీశ్ రావు ఆరోపించారు.
ఫిలిఫ్పైన్స్ తో ఒప్పందం కోసం గార్గ్ ను అడ్వైజర్ గా పెట్టుకున్నారని.. గార్గ్ అనే వ్యక్తి ఈడీ ,సీబీఐ కేసులు ఎదుర్కొంటున్నాడని ఆరోపించారు. బియ్యం ఎగుమతుల కోసం ఎంఓయూ కుదుర్చుకున్నారా? అని ప్రశ్నించారు. కాకినాడ పోర్టులో 7 వేల 500 మెట్రిక్ టన్నుల బియ్యం .. ఏడాదిగా ముక్కిపోయాయని విమర్శించారు. బియ్యం ఎగుమతితో సివిల్ సప్లైస్ శాఖకు కోట్ల నష్టం జరిగిందని ఆరోపించారు. బియ్యం ఎగుమతిపై హౌస్ కమిటీ వేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
హరీశ్ వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. ఫిలిఫ్పైన్స్ తో బియ్యం ఎగుమతులకు ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. బియ్యం ఎగుమతులపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం అని మండిపడ్డారు. ఏమీ తెలియకుండా స్కాం అంటూ హరీశ్ రావు ఆరోపిస్తున్నారని చెప్పారు. షిప్పింగ్ చార్జీలు, గోదాం ఛార్జీలు చార్జీలన్నీ ఫిలిప్పైన్స్ చూసుకుంటుందన్నారు. రైతులు పండించిన ప్రతీ ధాన్యపు గింజ కొంటున్నామని చెప్పారు. గత సర్కార్ కంటే ఎక్కువగా రైతులకు మేలు చేస్తున్నామని తెలిపారు. నేరుగా ఫిలిప్పైన్స్ మంత్రితోనే ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. అగ్రి మెంట్ చేసుకుని బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నామని చెప్పారు ఉత్తమ్. మీరు సిఫారసు చేసిన వ్యక్తులకు బియ్యం ఇవ్వకుంటే స్కాం జరిగినట్టేనా? అని హరీశ్ ను ప్రశ్నించారు ఉత్తమ్.
