ఓట్లు పడటానికి మనమేమన్నా సూపర్​స్టార్లమా

ఓట్లు పడటానికి మనమేమన్నా సూపర్​స్టార్లమా
  • కాంగ్రెస్​లో ‘హుజూరాబాద్’ కాక
  • పొలిటికల్ ​ఎఫైర్స్ ​కమిటీ మీటింగ్‌లో హాట్‌గా డిస్కషన్
  • ఓట్లేస్తానికి మనమేమన్నా సూపర్​స్టార్లమా: జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: హుజూరాబాద్ ​బై ఎలక్షన్‌లో ఘోర పరాజయంపై కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. పీసీసీ పొలిటికల్ ఎఫైర్స్​కమిటీ బుధవారం దీనిపై ఐదున్నర గంటలకు పైగా చర్చించింది. పీఏసీ కన్వీనర్​షబ్బీర్ అలీ అధ్యక్షతన గాంధీ భవన్‌లో జరిగిన భేటీలో పీసీసీ చీఫ్ రేవంత్, సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్, భట్టి, గీతారెడ్డి, జీవన్​రెడ్డి, రాజనర్సింహ, రేణుకా చౌదరి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్​ఓడిన తీరుపై నేతలు తీవ్ర కామెంట్లే చేశారని తెలుస్తోంది. కాంగ్రెస్ ఓటమికి తానే బాధ్యుడినన్న రేవంత్​కామెంట్లను అంతా తప్పుబట్టినట్టు సమాచారం. పార్టీ ఏ ఒక్కరిదీ కాదనీ, గెలుపోటములకు ఉమ్మడి బాధ్యత ఉంటుందని జానా అన్నారు. తన సూచనలు, సలహాలు పాటిస్తేనే ఇకపై మీటింగులకు వస్తానని, లేకపోతే రానని చెప్పినట్టు తెలిసింది. ఓట్లు పడటానికి మనమేమన్నా సూపర్​స్టార్లమా అని జగ్గారెడ్డి అన్నట్టు తెలిసింది. 

కేసీఆర్, ఈటల మధ్యే ఫైట్:​ షబ్బీర్
సీఎం కేసీఆర్, ఈటల మధ్యే ప్రధానంగా ఫైట్ జరిగిందని షబ్బీర్ అన్నారు. ఫలితంపై మీటింగ్ లో సీరియస్ గా చర్చించామని మీడియాకు చెప్పారు. హుజురాబాద్​లో కాంగ్రెస్ ఓటమిపై ఇద్దరు సభ్యుల కమిటీ వేశాం. వారు నివేదిక ఇస్తారన్నా‘‘9,10 తేదీల్లో మండల,  జిల్లా స్థాయిలో సభ్యత్వ నమోదు చేపట్టాలని డీసీసీలకు సూచించాం. నిజామాబాద్ లో 14 నుండి 21 వరకు ప్రజా చైతన్య యాత్ర చేస్తాం. పీసీసీ డిసిప్లినరీ యాక్షన్‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌గా మాజీ మంత్రి జి. చిన్నారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ జనరల్‌‌‌‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌‌‌‌ బుధవారం ప్రకటన విడుదల చేశారు. 

కేసీఆర్ కోట గోడ బద్దలైంది: దాసోజు
తెలంగాణను క్షుద్ర రాజకీయ, వ్యాపార ప్రయోగశాలగా మార్చారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌‌‌‌ విమర్శించారు. కాంగ్రెస్ నేతలు మధు యాష్కీ, షబ్బీర్ అలీ, మల్లు రవి, మహేశ్ గౌడ్ తదితరులతో కలిసి బుధవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.  ‘‘రూ.5,500 కోట్లు ఖర్చు చేసిన సీఎం కేసీఆర్ ఓడినందుకు సంబురపడాల్నా? రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టిన వ్యక్తి గెలిచినందుకు ఆనందపడాల్నా? మద్యం, మాంసం, డబ్బు సంచులు విచ్చలవిడిగా పంచుతుంటే ఎన్నికల కమిషన్‌‌‌‌ ఏం చేస్తున్నట్టు? మేం ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఏదేమైనా ఈ ఎన్నికతో కేసీఆర్ కోట గోడ బద్దలైంది” అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు అధైర్యపడొద్దని యాష్కీ అన్నారు.