V6 News

FIH‌ జూనియర్‌‌ విమెన్స్‌‌ హాకీ వరల్డ్‌‌ కప్‌‌.. పదో ప్లేస్‌‌లో ఇండియా

FIH‌ జూనియర్‌‌ విమెన్స్‌‌ హాకీ వరల్డ్‌‌ కప్‌‌.. పదో ప్లేస్‌‌లో ఇండియా

శాంటియాగో: ఎఫ్‌‌ఐహెచ్‌‌ జూనియర్‌‌ విమెన్స్‌‌ హాకీ వరల్డ్‌‌ కప్‌‌లో ఇండియా టీమ్‌‌ నిరాశపర్చింది. శుక్రవారం జరిగిన 9/10 వర్గీకరణ మ్యాచ్‌‌లో ఇండియా 1–2తో స్పెయిన్ చేతిలో ఓడి పదో ప్లేస్‌‌తో సరిపెట్టుకుంది. ఇండియా తరఫున కనికా సివాచి (41వ ని) ఏకైక గోల్‌‌ చేసింది. నటాలియా విలనోవా (16వ ని), ఎస్తర్‌‌ కానలెస్‌‌ (36వ ని) స్పెయిన్‌‌కు గోల్స్‌‌ అందించారు. 

తొలి క్వార్టర్‌‌లో ఇరుజట్లు హోరాహోరీగా పోటీపడినా గోల్స్‌‌ నమోదు కాలేదు. 14వ నిమిషంలో లభించిన పెనాల్టీని స్పెయిన్‌‌ వృథా చేసుకుంది. కానీ రెండో క్వార్టర్‌‌లో గోల్‌‌తో స్పెయిన్‌‌ ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత ఇండియాకు రెండు అవకాశాలు వచ్చినా వృథా అయ్యాయి. మూడో క్వార్టర్‌‌లో స్పెయిన్‌‌ ఆధిక్యం రెండుకు పెరగడంతో ఇండియాపై ఒత్తిడి పెరిగింది. 

41వ నిమిషంలో ఇండియాకు రెండు పెనాల్టీలు లభించగా అందులో ఒకటి గోల్‌‌గా మారింది. తర్వాత స్కోరును సమం చేసేందుకు ఇండియా చేసిన ప్రయత్నాలను స్పెయిన్‌‌ అడ్డుకుంది. మరోవైపు ఇండియా మెన్స్‌‌ హాకీ టీమ్‌‌ సౌతాఫ్రికా టూర్‌‌ను విజయంతో ముగించింది. చివరి మ్యాచ్‌‌లో 4–1తో నెగ్గింది.