
ఫిలిప్పీన్స్ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు రికీ దావో (63) మరణించారు. ఆయన కుమార్తె ఆరా (అరబెల్లా) ఈ విషయాన్ని శుక్రవారం (2025 మే 2న) సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
"మా ప్రియమైన తండ్రి రికీ దావావో మరణాన్ని ప్రకటించడం చాలా బాధగా ఉంది. క్యాన్సర్‌కు సంబంధించిన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొన్న తర్వాత, తన పిల్లలు మరియు ప్రియమైనవారి చుట్టూ ఆయన ప్రశాంతంగా మరణించారు" అంటూ పోస్టులో భావోద్వేగ నోట్ రాస్తూ వెల్లడించింది.
అయితే, 2024 నుండి రికీ దావో క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు సమాచారం. దావోకు ముగ్గురు పిల్లలు. వారిలో అరబెల్లా, రిక్కీ మే, మరియు కెన్నెత్ ఉన్నారు.
నాలుగు దశాబ్దాలకు పైగా, రికీ దావో తన జీవితాన్ని నటన మరియు దర్శకత్వ కళకు అంకితం చేశారు. ఆయన అద్భుతమైన రచనలతో వందకిపైగా మూవీస్ చేశాడు. ఎన్నో సినిమాల్లో నటించి అవార్డులు సైతం గెలుచుకున్నాడు.