మళ్లీ వివాదంలో సినీ నటి కల్పిక ..మొయినాబాద్ రిసార్ట్లో హంగామా

మళ్లీ వివాదంలో సినీ నటి కల్పిక ..మొయినాబాద్ రిసార్ట్లో హంగామా
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన యాజమాన్యం

చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ కనకమామిడి బ్రౌన్ టౌన్ రిసార్ట్​​లో సినీ నటి కల్పిక హంగామా   సృష్టించింది. సోమవారం మధ్యాహ్నం క్యాబ్​​లో వచ్చిన ఆమె.. రూమ్​లో దిగిన కాసేపటికి రిసార్ట్ రిసెప్షన్​లో మేనేజర్ కృష్ణపై దురుసుగా ప్రవర్తించింది. 

మెనూ కార్డు, రూమ్ కీస్ మొహంపై విసిరేసి బూతులు తిట్టింది. సిగరెట్స్ కావాలంటూ సిబ్బందినీ దుర్భాలాడి వెళ్లిపోయింది. దాదాపు 40 నిమిషాలు ఎందుకిలా చేసిందో అర్థం కాకపోవడంతో రిసార్ట్​ నిర్వాహకులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ ఘటనపై కల్పిక స్పందించారు. 

‘క్యాబ్ ఫెసిలిటీ లేదు.. వైఫై ఫెసిలిటీ లేదు.. సిగరెట్ తీసుకురమ్మంటే తీసుకురాలేదు.. ఎన్నిసార్లు చెప్పినా సిబ్బంది స్పందించకపోవడంతోటే నేను బూతులు తిట్టాల్సి వచ్చింది. బ్రౌన్ టౌన్ రిసార్ట్ సిబ్బంది నా పట్ల దురుసుగా ప్రవర్తించారు’ అని తెలిపింది. సిటీలోని ఓ పబ్​లోనూ ఇటీవల కల్పిక గొడవకు దిగడం వివాదాస్పదమైన  సంగతి తెలిసిందే.