
సూర్య తేజ ఏలే హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘భరతనాట్యం’. మీనాక్షి గోస్వామి హీరోయిన్. ‘దొరసాని’ ఫేమ్ కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో పాయల్ సరాఫ్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సూర్య తేజ మాట్లాడుతూ ‘-నిజానికి నేను హీరో కావాలని అనుకోలేదు. చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి రావాలి, డైరెక్షన్ చేయాలనే ఆసక్తి ఉండేది. కాలేజ్ పూర్తయిన తర్వాత రైటింగ్‌పై ఇంటరెస్ట్ పెరిగింది. అలా కొన్ని కథలు రాశా. ప్రొడ్యూసర్ పాయల్ భర్త హితేష్‌కి ఈ స్టోరీ చెప్పా.
తర్వాత కేవీఆర్ మహేంద్ర గారికి చెప్పా. వీరిద్దరికి కథ నచ్చడంతో సినిమా మొదలైంది. ఇందులో నా పాత్ర ఏ కొత్త నటుడు చేసినా బావుంటుంది. దర్శకుడు, నిర్మాతలు ఈ పాత్ర నేను చేస్తే బావుంటుందని చెప్పడంతో చేశా. ఇదొక ఫిక్షనల్ స్టోరీ. కానీ రియల్ లైఫ్‌తో రిలేట్ చేసుకునేలా ఉంటుంది. ఒక మనిషి షార్ట్ కట్‌లో వెళితే ఏం జరుగుతుందనేది పాయింట్. పర్సనల్‌గా ఫీలైన స్ట్రగుల్స్‌ని కామికల్‌గా చేసి రాసింది.
ALSO READ : సమ్మర్‌కు మేమిస్తున్న గిఫ్ట్ ఫ్యామిలీ స్టార్: మూవీ టీమ్
కమర్షియల్ గా చాలా మంచి ఎంటర్ టైనర్. నేను కథ రాసుకున్నప్పుడే అజయ్ ఘోష్, టెంపర్ వంశీ, వైవా హర్ష పాత్రలు అనుకున్నాను. వారి పాత్రలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. డీవోపీ వెంకట్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. వివేక్ సాగర్ రావడంతో సినిమా స్కేల్ మరింతగా పెరిగింది. నిర్మాత కూడా ఈ కథను బాగా నమ్మడంతో అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. కుటుంబం అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది’ అని చెప్పాడు.