సమ్మర్‌‌‌‌కు మేమిస్తున్న గిఫ్ట్ ఫ్యామిలీ స్టార్: మూవీ టీమ్

సమ్మర్‌‌‌‌కు మేమిస్తున్న గిఫ్ట్ ఫ్యామిలీ స్టార్: మూవీ టీమ్

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ఏప్రిల్ 5న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘ఆరేళ్ల కిందట నా కెరీర్‌‌‌‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘గీత గోవిందం’ ఇదే డైరెక్టర్‌‌‌‌తో చేశా. ఆ సినిమా వంద కోట్లు వసూళ్లు చేసింది. ఆ తర్వాత అలాంటి మూవీ నాకు దక్కలేదు. ఈ సినిమా నాకొక  ఇంపార్టెంట్ స్టాప్. కచ్చితంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌‌కు నచ్చుతుంది. ఈ సమ్మర్‌‌‌‌కు మా టీమ్ నుంచి ఇస్తున్న చిన్న గిఫ్ట్ ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీస్‌‌తో కలిసి ఎంజాయ్ చేయండి’ అని చెప్పాడు.  

ALSO READ : ఎన్టీఆర్ ఇంట్లో టిల్లు స్క్వేర్ సక్సెస్ పార్టీ సెలబ్రేషన్స్

మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ ‘-సీతా రామం, హాయ్ నాన్న, ఇప్పుడు ఫ్యామిలీ స్టార్‌‌‌‌తో నన్ను తెలుగు అమ్మాయిగా యాక్సెప్ట్ చేశారు. ఇలాంటి గొప్ప అవకాశం నాకు ఇచ్చిన డైరెక్టర్ పరశురామ్ గారికి థ్యాంక్స్’ అని చెప్పింది. పరశురామ్ మాట్లాడుతూ ‘ఈ సినిమా  కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఉంటుంది. ఇందులోని ఎమోషన్స్‌‌కు కనెక్ట్ అవుతారు. విజయ్ ఇప్పటిదాకా చేసిన పర్‌‌‌‌ఫార్మెన్స్‌‌లు ఒకెత్తు. ఈ సినిమా మరో ఎత్తు అనుకోవచ్చు’ అని అన్నాడు. దిల్ రాజు మాట్లాడుతూ ‘మన ఫ్యామిలీస్‌‌లోని ఎమోషన్స్ అన్నీ కలిపి తయారు చేసిన  సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. సకుటుంబంగా ప్రతి ఒక్కరినీ ఎంటర్ టైన్‌‌ చేస్తుంది. విజయ్ క్యారెక్టర్ హైలైట్ అవుతుంది. ఈ  చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని అలరించి పెద్ద సక్సెస్ అందుకుంటుంది’ అని చెప్పారు. టీమ్ అంతా పాల్గొన్నారు.