మాదాపూర్ డ్రగ్స్ కేసు అప్డేట్...డ్రగ్స్ మాఫియాతో వెంకట్కు లింక్.?

మాదాపూర్  డ్రగ్స్ కేసు అప్డేట్...డ్రగ్స్ మాఫియాతో వెంకట్కు లింక్.?

మాదాపూర్ డ్రగ్స్ పార్టీ కేసులో  కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. రేవ్ పార్టీని నిర్మాత వెంకట్ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు.  గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి డ్రగ్స్ పార్టీలు నిర్వయిస్తున్నట్లు తేలింది.బాలాజీ పై గతంలోనూ కేసులుఉన్నట్లు గుర్తించారు. 

3 నెలలుగా వెంకట్  కదలికలపై నిఘా పెట్టిన నార్కోటిక్స్ బ్యూర్..డ్రగ్స్ మాఫియాతో సంబంధాలపై ఆరా తీస్తోంది.  డ్రగ్స్ కోసం అతడు వాట్సాప్ లో చాటింగ్  చేసినట్లు గుర్తించింది.  డ్రగ్స్ పార్టీకి బాలాజీ, వెంకట్ రెడ్డి, డి.మురళి, మధుబాల, మేహక్ హాజరయ్యారు. డమరుకం, ఆటోనగర్ సూర్య, పూలరంగడు,  లవ్ లీ సినిమాలకు వెంకట్ ఫైనాన్షియర్ గా ఉన్నాడు. 

అర్థరాత్రి రేవ్ పార్టీ.. భారీగా డ్రగ్స్ స్వాధీనం

 ఆగస్టు 31న ఉదయం విఠల్ రావు నగర్ వైష్ణవి అపార్ట్ మెంట్ లో  యాంటీ నార్కొటిక్ బ్యూరో అధికారులు దాడుల చేసి పార్టీని భగ్నం చేశారు. భారీగా కొకైన్, ఎల్ఎస్ డీ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ వినియోగిస్తున్న ఐదుగురుని నార్కోటిక్ అధికారులు అరెస్ట్ చేశారు.

 అరెస్ట్ అయిన వారిలో  సినీ నిర్మాత వెంకట్ తో పాటు పలువురు  ప్రముఖులు,  సినీ పరిశ్రమకు  చెందిన పలువురు యువతులు ఉన్నారు.  అరెస్ట్ చేసిన వారందరిని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు నార్కోటికి బ్యూరో అధికారులు.