ఈవారం ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాలు

ఈవారం ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాలు

టాలీవుడ్ లో ప్రతీ వారం లాగే ఈ వారం కూడా వరుస సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రస్తుతం థియేటర్స్ లో గత వారం రిలీజైన బేబీ(Baby) సినిమా అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకుపోతింది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. భారీ విజయాన్ని అందుకుంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ.23 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 

మరి ఈ వారం తెలుగు ఏ సినిమాలు రిలీజ్ కానున్నాయనేది ఇప్పుడు తెల్సుకుందాం. ముందుగా జులై 20న అశ్విన్ బాబు హీరోగా వస్తున్న హిడింబ సినిమా రిలీజ్ కానుంది. సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రానున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక జులై 21న హాలీవుడ్ సినిమా ఒప్పన్ హైమర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక అదే రోజు తెలుగు నుండి HER,అన్నపూర్ణ ఫోటో స్టూడియో,అలా ఇలా ఎలా, జిలేబి, నాతో నేను, హత్య సినిమాలు థియేటర్స్ లోకి రానున్నాయి. ఇక జులై 22న నాగ ద్వీపం అనే సినిమా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాల్లో ఆడియన్స్ ను ఏ సినిమా మెప్పిస్తుందో చూడాలి మరి.